- ఇంతకన్నా సిగ్గుచేటు ఏమేమైనా ఉంటుందా?
- ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిద
- అవసరమైతే డబ్యులు ఖర్చు చేసి ఆహారం అందించాలి
- ఆహార కొరతను అధిగమించాలి..సమస్య అంతా కేంద్రం వద్దే
- ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు
- రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటం
- రాష్ట్రంలోనే కాదు..దేశం మొత్తం ఈ సమస్య ఉంది
- ఎన్నికలు వొచ్చినప్పుడల్లా..మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని
- కేంద్రాన్ని ఘాటుగా హెచ్చరించిన కెసిఆర్
గురువారం టిఆర్ఎస్ మహాధర్నాలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ధాన్యం కొంటరా..కొనరా చెప్పమంటే చెప్తలేరని, మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట..ఏం జరుగుతుంది. ఏందీ గడబిడి. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చట..అంటూ కేంద్రాన్ని నిలదీసారు. బీజేపీ నాయకులు వంకర టింకర మాటలు మాట్లాడుతున్నారు. ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు. భారతదేశం మొత్తంలో ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార దీక్షలు చేస్తున్నారు.
పంటలు పండించే శక్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీల ప్రభుత్వాలు దారుణంగా విఫలం చెందాయి. పంటలు కొనడానికి వి•కు భయం అవుతుంది. బాధ అవుతుంది. అడ్డగోలుగా మాట్లాడటం కాదు.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానంలో ఉంది. ఇంతకన్న సిగ్గుచేటు ఏమైనా ఉంటదా? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అద్భుతమైన నదులున్నాయి. బంగారు పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దేశంలో 60 వేల టిఎంసిల నీరు ఉంది.
కానీ అన్ని అవసరాలకు మనం వాడుకునేది కేవలం 30టిఎంసీలే. మిగితావన్ని సముద్రంలో కలుస్తున్నాయి. కానీ కేంద్రం దేశానికీ, రైతులకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాలకు చరమగీతం పాడాల్సిందే. జెండా ఎత్తాల్సిందే. దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. మేం పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని, చెరువులను బాగు చేసుకుని, చెక్‌డ్యాంలు కట్టి, కరెంట్ ఇచ్చి రైతులను బాగు చేసుకున్నాం. పంటలు పండించుకున్నాం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. కానీ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. హంగర్ ఇండెక్స్‌లో భారత్ ఆకలి రాజ్యం అని తెలుస్తుంది. దేశంలో ఏ మూలలో ఆహార కొరత ఉందో సమన్వయం చేయాలి. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి ఆహారం అందించాలి. సమస్య ఉన్నదంతా కేంద్రం వద్దే. కేంద్రం వి•ద యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర భారత రైతాంగం కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తుంది.
రైతుల జీవితాలపై చెలగాటమాడుతుంది. కార్లతో తొక్కి చంపుతుంది. ఇవాళ తెలంగాణ రైతులపై బీజేపీ నేతలు కన్నేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దిక్కు మాలిన కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారు. వడ్లు వేయాలి.. మెడలు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ దేశాన్ని పాలించే బీజేపీ అడ్డగోలు అబద్దాలు మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వితండవాదాలు సృష్టిస్తున్నారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరెంట్ మోటర్లకు వి•టర్లు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చాక తదుపరికార్యాచరణ చేస్తామని ప్రకటించారు.
ఎన్నికలు వొచ్చినప్పుడల్లా..మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని
ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని అని సిఎం కేసీఆర్ బిజెపిపై ధ్వజమెత్తారు. రాష్ట్రాల సమస్యలను గాలికి వొదిలేసి, రైతులను పట్టించుకోకుండా బీజేపీ పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఇందిరా పార్క్ ధర్నాలో కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో దళితుల వర్గీకరణపై మాట్లాడరు. తెలంగాణలో గిరిజనుల శాతం పెరిగింది. వారికి రిజర్వేషన్ ఇవ్వమని అడిగితే దిక్కు లేదు. అనేక సమస్యలు పెండింగ్‌లో పెట్టారు.
బీసీ కుల గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే సమాధానం లేదు. అనేక ప్రజా సమస్యలు పక్కన పెట్టి, ఎలక్షన్ వొచ్చినప్పుడల్లా డ్రామాలాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్‌తో రాజకీయం నడుపుతున్నారు. కాలం చెల్లిపోయింది. అందరూ గమనిస్తున్నారు. అందరికీ అర్థమైపోయింది. మీ సర్జికల్ స్ట్రైక్‌లు, మీరు సరిహద్దుల్లో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలై బయటకు వొచ్చేశాయని సిఎం మండిపడ్డారు. ఎలక్షన్ వొస్తే హిందూ ముస్లిం కొట్లాట పెట్టాలి. ఎలక్షన్ వస్తే పాకిస్తాన్ పేరు తీసుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఇదేనా రాజకీయం. దీని కోసమేనా మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నది. మీరు దేశానికి సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.