Take a fresh look at your lifestyle.

వేగంగా పెరుగుతున్న కేసుల్లోభారత్‌ ‌నాల్గవ స్థానం ..!

మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌, ‌రష్యా…
భారత్‌ ‌లో ధ్రువీకరణ అయిన కొరోనా కేసులు1,45,380

కోవిడ్‌ -19 ‌వల్ల మన దేశంలో మరణాల సంఖ్య 4,167కి పెరిగింది. కేసులు మాత్రం 1,45,380కి ఎగబాకాయి.సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఇంతవరకూ మరణించిన వారి వారు 146 కాగా, కొత్తగా 6535 కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు తెలియజేసింది.మే 25వ తేదీన మన దేశం ప్రపంచ వ్యాప్తంగా కొరోనా బాధితుల జాబితాలో పదవ స్థానానికి చేరగా,ఇప్పుడు వేగంగా పెరుగుతున్న కేసుల్లో నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా, బ్రెజిల్‌, ‌రష్యాల తర్వాతి స్థానం మన దేశానిదే.మన దేశంలో కోవిడ్‌  ఆక్టివ్‌ ‌కేసులు 80,722కి పెరిగాయి. వీరిలో 60,490 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.మన దేశంలో41.61 శాతం మంది కొరోనా రోగులు కోలుకున్నారని ఆరోగ్య శాఖ సీనియర్‌ అధికారి తెలిపారు. మన దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ ప్రతినిధి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 25వ తేదీన కోవిడ్‌ -19 ‌సోకిన వారిలో 41.84 శాతం మంది కోలుకున్నారని  అధికారి తెలిపారు.సోమవారం ఉదయం నుంచి సంభవించిన కొరోనా మరణాల్లో మహారాష్ట్రకు చెందిన వారు 60 మంది, గుజరాత్‌ 30,‌ఢిల్లీ 15, మధ్యప్రదేశ్‌ 10, ‌తమిళనాడు ఏడు, పశ్చిమ బెంగాల్‌ 6, ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్థాన్‌ ‌లలో చెరి నాలుగు, తెలంగాణ మూడు, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్ము, కాశ్మీర్‌ ‌లలో చెరి ఇద్దరు, కేరళలో ఒకరు.కొరోనా వల్ల మరణించిన వారి సంఖ్య మొత్తం 4, 167 కాగా, వీరిలో మహారాష్ట్ర 1,695తో అగ్రస్థానంలో ఉంది. తర్వాత 888తో గుజరాత్‌ ‌రెండవ స్థానంలో, మద్యప్రదేశ్‌ 300 ‌స్థానాలతో మూడవ స్థానంలో, 278తో పశ్చిమ బెంగాల్‌, ‌నాల్గవస్థానంలో, 276 తో ఢిల్లీ ఐదవ స్థానంలో, రాజస్థాన్‌167, ఉత్తర ప్రదేశ్‌ 165, ‌తమిళనాడు 118, ఆంధ్రప్రదేశ్‌,‌తెలంగాణలు చెరి 56 , కర్నాటక 44, పంజాబ్‌ 40, ‌జమ్ము,కాశ్మీర్‌ 23, ‌హర్యానా 16, బీహార్‌ 13, ఒడిషా ఏడు మరణాలు నమోదు అయ్యాయి. కేరళ, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లలో ఐదేసి మంది మరణించారు. అసోం నలుగురు.,చండీగఢ్‌ ఉత్తరాఖండ్‌ ‌చెరి ముగ్గురు , మేఘాల యలో ఒకరు మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply