Take a fresh look at your lifestyle.

‘ఫ్లిప్పింగ్‌’ ‌తో ఆదాయాన్ని కోల్పోతున్న భారత్‌

  • ‌విదేశీ వ్యాపారుల చేతుల్లోకి భారతీయ కంపెనీలు
  • వినియోగదారుల డేటా, మేథో సంపత్తి బదిలీతో దేశ భద్రతకు ముప్పు
  • విదేశీ సంస్థలుగా ప్రకటించాలని స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌డిమాండ్‌

భారత దేశంలో వాల్‌ ‌మార్ట్ ‌వంటి కంపెనీల వలన చిన్న వ్యాపారులు తీవ్రపోటీ ఎదుర్కుంటున్నారు. ఈ కంపెనీల వలన చిన్న వ్యాపారుల షాపులు రోజు రోజుకి మూతపడుతున్నాయి..ఈ విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. విదేశీ నియంత్రణలో ఉన్న భారతీయ స్టార్టప్‌లను విదేశీ సంస్థలుగా ప్రకటించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌జాతీయ కో-కన్వీనర్‌ అశ్విని మహాజన్‌ ‌మాట్లాడుతూ భారతదేశంలోని స్టార్టప్‌లపై విదేశీ కంపెనీలకు ఉన్న నియంత్రణ వల్ల దేశానికీ భారీగా నష్టం వాటిల్లుతున్నదని అన్నారు. ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అని ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ అనే ప్రచారాలను పెద్దపెట్టున చేస్తున్నది. మరోపక్క ఆర్‌ఎస్‌ఎస్‌-అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌భారతీయ స్టార్టప్‌లపై విదేశీ నియంత్రణ కొనసాగుతున్నదని ‘‘ఫ్లిప్పింగ్‌’’ ‌పై దృష్టి సారించి ఇటువంటి భారతీయ కంపెనీలను విదేశీ కంపెనీలుగా ప్రకటించాలని డిమాండ్‌ ‌చేసింది.

ఫ్లిప్‌కార్ట్ ‌సంస్థ ‘‘ఫ్లిప్పింగ్‌’’ ‌కి పాల్పడి వాల్‌మార్ట్‌కు భారతీయ మార్కెట్‌పై సమర్థవంతమైన నియంత్రణ అధికారాన్ని అందిస్తుందని స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌చెబుతున్నది. ‘‘ఇద్దరు భారతీయ పురుషులు యునికార్న్ ‌కంపెనీ(ఫ్లిప్‌కార్ట్) ‌తయారు చేశారని చెప్పుకోవటానికి గర్వంగా ఉండవచ్చు. ఈ కంపెనీ 20 బిలియన్ల యూఎస్‌ ‌డాలర్ల మార్కెట్‌ ‌వాల్యుయేషన్‌ను సాధించింది. అయితే వాస్తవం ఏమిటంటే ఫ్లిప్‌కార్ట్ ‌ప్రమోటర్లు ఇండియా నుండి పారిపోయారు. వారు తమ కంపెనీని సింగపూర్‌లోని అనుబంధ కంపెనీలతో కలిపి వేరేగా ఇతర కంపెనీగా నమోదు చేసుకున్నారు. ఈ కంపెనీల సమూహాన్ని వాల్‌మార్ట్‌కు అమ్మేసారు. (77 శాతం వాటాలు వాల్‌మార్ట్‌కు బదిలీ చేయబడ్డాయి) ఇలా ఈ యునికార్న్ ‌కంపెనీ మాత్రమే విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లలేదు, భారతీయ రిటైల్‌ ‌మార్కెట్‌ ‌లోని వాటా కూడా విదేశీ కంపెనీకి బదిలీ చేయబడింది.’’ అని స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌జాతీయ కో-కన్వీనర్‌ ‌డాక్టర్‌ అశ్విని మహాజన్‌ ‌తెలిపారు. యునైటెడ్‌ ‌స్టేట్స్‌లో ఫ్లిప్పింగ్‌ అనే పదాన్ని ‘‘ఆదాయాన్ని సృష్టించే ఆస్తిని కొనుగోలు చేయడం..తిరిగి అంతే త్వరగా లాభం కోసం అమ్మడం’’ అనే పక్రియను వివరించటానికి ఉపయోగిస్తారు. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌ప్రకారం, ఒక భారతీయ కంపెనీని ఫ్లిప్పింగ్‌ ‌చేస్తున్నది అంటే పై లావాదేవీలను చేస్తున్నది అని అర్థం. ఒక భారతీయ సంస్థ ఒక విదేశీ కంపెనీ అధికార పరిధిలో ఆ కంపెనీలో విలీనం అయి ఈ పని చేస్తున్నది.

‘‘భారతదేశంలో ప్రారంభమైన, భారతీయ వ్యవస్థాపకులను కలిగి ఉన్న అనేక వందల భారతీయ యునికార్న్ ‌కంపెనీలు ఫ్లిప్పింగ్‌లో విదేశీ వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. వీటిలో మెజారిటీ కంపెనీలు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రాథమిక మార్కెట్‌ ‌కలిగి ఉన్నాయి. వీటిని దాదాపు అందరూ తమ మేథో సంపత్తిని(ఐపి), భారతీయ వనరులను(మానవ, క్యాపిటల్‌ ఆస్తులు, ప్రభుత్వ మద్దతు మొదలైనవి) ఉపయోగించి అభివృద్ధి చేశారు, ’’ అని మహాజన్‌ ‌తెలిపారు. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌ప్రకారం, భారతీయ నియంత్రణ భూభాగంలో అమలయ్యే భారతీయ పన్ను చట్టాలను, భారతీయ అధికారుల పరిశీలనల నుంచి తప్పించటానికి ఇలా చేస్తున్నారు. ‘‘వివిధ అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్టీ కంపెనీలను విదేశాలకు ఫ్లిపింగ్‌ ‌చేయమని బలవంతం చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టటానికి ఫ్లిపింగ్‌ను ఒక షరతుగా పెడుతున్నారు. ఎందుకంటే డేటా..మేథా సంపత్తికి(ఇంటలెక్చువల్‌ ‌ప్రాపర్టీ) సంభందించిన ప్రధాన కార్యాలయం వీరికి విదేశాలలో కావాలి. ఈ రంగంలోనే అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు.’’ అని మహాజన్‌ ‌తెలిపారు. యుఎస్‌..‌సింగపూర్‌ ‌వంటి దేశాలలో అనుకూలమైన విదేశాంగ విధానాలు అమలవుతున్న కారణంగా ఇలా జరుగుతున్నది. ఈ దేశాల్లో తక్కువ కార్పొరేట్‌ ‌పన్ను, స్థిర జిఎస్‌టి, జీరో క్యాపిటల్‌ ‌గెయిన్స్ ‌టాక్స్ ‌రేట్‌, ‌డబుల్‌ ‌టాక్సేషన్‌ ఎగవేత ఒప్పందాలు, క్లిష్టమైన సమస్యలపై సాధారణ మెజారిటీ వోటు, ఐపి రక్షణ చట్టాలు మొదలైన వాటిని అనుమతిస్తున్నారు.

‘ఫ్లిప్పింగ్‌’ ‌భారత దేశ ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. ‘‘భారతదేశంలో 90%ం విలువ సృష్టించబడినప్పటికీ, భారతీయ కంపెనీలు విదేశీ కార్పొరేషన్‌ ‌యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థలుగా మారడం వలన విపరీతమైన ఆర్థిక జాతీయ నష్టానికి కారణమవుతున్నాయి. దాని ఫలితంగా క్యాపిటల్‌ ‌గెయిన్స్, ‌పబ్లిక్‌ ‌లిస్టింగ్‌, ఆపరేషనల్‌ ‌ప్రాఫిట్స్, ‌ఫ్యూచర్‌ ‌టాక్స్ ‌మొదలైన వాటిపై పట్టు కోల్పోతామని.’’ మహాజన్‌ అం‌టున్నారు. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌ప్రకారం, ఫ్లిప్పింగ్‌ ‌వలన ఎంతో ప్రాముఖ్యత కలిగిన వినియోగదారుల డేటా..మేథో సంపత్తి హక్కులు విదేశాలకు బదిలీ అవుతున్నది. ‘‘ఫ్లిప్పింగ్‌ ‌మొత్తం దేశ డేటాపై భద్రతా ముప్పును తీసుకువస్తుంది. సదరు కంపెనీకి సంబంధించిన మొత్తం మేథో సంపత్తి సంబంధిత హక్కులు భవిష్యత్తులో సాధ్యమయ్యే విలువ గణనీయంగా కోల్పోతుంది. విదేశీ హెచ్‌క్యూ నిర్మాణాల కారణంగా, భవిష్యత్తులో యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తిన పక్షంలో దేశ భద్రతా సమస్యలకు తీవ్ర ముప్పు ఉంటుందని. ఈ కంపెనీలకు మద్దతు ఇచ్చే డబ్బు మూలాన్ని భారత ప్రభుత్వం గుర్తించలేకపోతుంది, ’’అని మహాజన్‌ ‌వాపోతున్నారు. వాస్తవం ఏమిటంటే వాల్‌ ‌మార్ట్ ‌వంటి కంపెనీల వలన భారత్‌ ‌లోని చిన్న వ్యాపారులు తీవ్రపోటీ ఎదురుకొంటున్నారు. అందుకే వీళ్ళు వినియోగదారుల డేటా హక్కుల గురించి ప్రవచిస్తూ..దేశ భద్రతకి ముప్పు అని చెబుతూ తన బతుకు పోరాటం చేస్తున్నారు.

Leave a Reply