Take a fresh look at your lifestyle.

చరిత్ర సృష్టించిన ఇండియా

  • 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని దాటిన భారత్‌
  • అనేక దేశాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ
  • చైనా తర్వాత ఈ మార్క్‌ను దాటిన రెండో దేశం
  • 75 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్‌
  • 130 ‌కోట్ల భారతీయుల సమష్టి స్ఫూర్తి అన్న ప్రధాని మోడీ
  • పక్రియలో పాల్గొన్న వారికి అభినందన
  • ఉపరాష్ట్రపతి, హోంమంత్రి, మంత్రుల అభినందనలు

కోవిడ్‌-19 ‌వ్యాక్సినేషన్‌లో భారత్‌ ‌గొప్ప ఘనత సృష్టించిందని ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల టీకా డోసులను ప్రజలకు ఇచ్చారు. చైనా తర్వాత ఈ మార్క్‌ను దాటిన భారత్‌ ‌రెండవ దేశంగా నిలువగా ఇది అమెరికాలో ఇచ్చిన టీకా డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికంగా ఉంది. దేశ జనాభాలో టీకా తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ ‌తొలి డోస్‌ ‌తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌, ఉత్తరాఖండ్‌, ‌సిక్కిం, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌దాద్రా అండ్‌ ‌నగర్‌ ‌హవేలీ, డామన్‌ అం‌డ్‌ ‌డయ్యూ, గోవా, లక్షద్వీప్‌ ‌నూటికి నూరు శాతం తొలి డోస్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైన వారిలో 90 శాతం మందికి  తొలి డోసు వ్యాక్సినేషన్‌ ‌జరిగినట్లు పేర్కొంది.

ఈ చరిత్రాత్మక ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఓ పాటను ఆవిష్కరించడంతోపాటు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద అతి పెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని మారుమూల ప్రాంతాలకు టీకాలను సరఫరా చేయడం కోసం డ్రోన్లను కూడా ఉపయోగించడం విశేషం. కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ 100 ‌కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని భారత్‌ అధిగమించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తిని ప్రశంసించారు. ఈ విజయానికి కారకులైన వైద్య సిబ్బంది, నర్సులు, ప్రజలకు మోదీ ఓ ట్వీట్‌ ‌ద్వారా ధన్యవాదాలు తెలిపారు. భారత దేశం చరిత్ర సృష్టించిందని ప్రధాని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి స్ఫూర్తి, భారతీయ శాస్త్ర విజ్ఞానం, పరిశ్రమ సాధించిన విజయాన్ని మనం చూస్తున్నామన్నారు.

100 crore vaccine dose milestone

100 కోట్ల టీకాల పంపిణీని అధిగమించినందుకు భారత దేశానికి అభినందనలు అని పేర్కొన్నారు. మనమంతా కలిసి కొరోనాను ఓడిద్దామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అమిత్‌ ‌షా ఇచ్చిన ట్వీట్లలో, ఇది చరిత్రాత్మక, గర్వకారణమైన సమయమని తెలిపారు. 100 కోట్లు కన్నా ఎక్కువ టీకాల పంపిణీ లక్ష్యాన్ని భారత దేశం సాధించిందన్నారు. నవ భారత శక్తి, సామర్థ్యాలను యావత్తు ప్రపంచానికి మరోసారి తెలియజేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, నిరంతర ప్రోత్సాహం దోహదపడ్డాయని తెలిపారు.

అనేక సవాళ్ళను అధిగమించి ఈ మహా యజ్ఞం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, హెల్త్ ‌వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌరుని భద్రత, ఆరోగ్యం కోసం దృఢనిశ్చయంతో కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. ఈ సందర్భంగా మోదీ గురువారం ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ ‌లోహియా హాస్పిటల్‌ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ ఉన్నారు. కోట్లు అంటే కేవలం ఒక సంఖ్య కాదు.. వంద కోట్లకు పైగా ప్రజల ఆత్మవిశ్వాసం. టీకా పంపిణీలో చిరస్మరణీయ ఘనత సాధించిన సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలని కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు.

Leave a Reply