Take a fresh look at your lifestyle.

భారత్‌ ‌సామర్థ్యాన్ని చాటిన వ్యాక్సినేషన్‌ ‌పక్రియ

  • దేశం కొత్త శక్తితో, ఉత్సాహంతో ముందుకు
  • మనం ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు
  • ఆరోగ్య కార్యకర్తల సేవా సంకల్పం మానవాళికి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది
  • డ్రోన్‌ ‌టెక్నాలజీని యువత సద్వినియోగం చేసుకొవాలి
  • ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌లో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

100 ‌కోట్ల కోవిడ్‌ ‌టీకా డోసుల పంపిణీ మైలురాయిని దాటిన తర్వాత దేశం కొత్త శక్తితో, ఉత్సాహంతో ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. తన నెలవారీ ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌ప్రసారంలో ఆదివారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ..టీకా మైలురాయి కోసం ఆరోగ్య కార్యకర్తల సేవా నిరతిని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. భారతదేశం యొక్క కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌విజయవంతం కావడం దేశ సామర్థ్యాన్ని చాటిందని, 100 కోట్ల మైలురాయిని దాటిన తర్వాత దేశం కొత్త శక్తితో ముందుకు సాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ ప్రజలకు టీకాలు వేయడానికి ఆరోగ్య కార్యకర్తలు ఏమాత్రం తీసిపోరని తనకు తెలుసునని అన్నారు. వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌విజయం భారతదేశం యొక్క సామర్థ్యాన్ని, ‘సబ్కా ప్రయాస్‌’ (‌సమష్టి కృషి) బలాన్ని నిరూపిస్తుందని ఆయన అన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని అన్నారు. మనకు ఐక్యత సందేశాన్ని అందించిన సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌కు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, ఆయన చూపిన మేరకు కార్యాచరణలో మనమందరం తప్పనిసరిగా చేరాలని అన్నారు. యూరీ నుంచి పఠాన్‌కోట్‌ ‌వరకు బైక్‌ ‌ర్యాలీ నిర్వహించడం ద్వారా జమ్ముకశ్మీర్‌ ‌పోలీసు సిబ్బంది ఐక్యతా సందేశాన్ని ఇచ్చారని, మన ఐక్యతతోనే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని సర్దార్‌ ‌చెప్పేవారని, మనలో ఐక్యత లేకపోతే మనం కొత్త విపత్తుల్లో చిక్కుకున్నట్లే భావించాలని ప్రధాని సూచించారు.

సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అక్టోబర్‌ 21‌న, కోవిడ్‌-19‌పై పోరుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయి అయిన 100 కోట్ల మార్కును అధిగమించిందని అన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ విశ్వ శాంతి కోసం కృషి చేస్తుందని, యునైటెడ్‌ ‌నేషన్స్ ‌శాంతి పరిరక్షక దళాలకు దేశం అందించిన సహకారంలో ఇది కనిపిస్తుందని మోడీ అన్నారు. యోగా మరియు సాంప్రదాయక వెల్‌నెస్‌ ‌పద్ధతులు మరింత ప్రాచుర్యం పొందడానికి కూడా భారత్‌ ‌కృషి చేస్తుందని ఆయన చెప్పారు. మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య పెరగడాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. 2014లో 1.05 లక్షల నుండి ఇప్పుడు 2.15 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. ‘లోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ అం‌శంపై మాట్లాడుతూ పండుగ సీజన్‌లో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

డ్రోన్‌ ‌టెక్నాలజీని యువత సద్వినియోగం చేసుకొవాలి
వివిధ రంగాల్లో పెరుగుతున్న డ్రోన్‌ ‌టెక్నాలజీ వినియోగాన్ని నొక్కిచెప్పిన మోదీ, లైసెన్సులు మరియు అనుమతులు పొందడంలో అవాంతరాలు లేకుండా చేసేందుకు ఆగస్టు 25న కొత్త డ్రోన్‌ ‌విధానాన్ని దేశం ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. డ్రోన్‌ ‌టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మోదీ అన్నారు. డ్రోన్‌ ‌విధానం తర్వాత సృష్టించబడిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్‌ ‌రాంచీ సమీపంలోని సపరోమ్‌ ‌నాయ సరాయ్‌ అనే గ్రామ ప్రజలు అందించిన సహకారాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. రాబోయే దీపావళి, గోవర్ధన్‌ ‌పూజ, భాయ్‌ ‌దూజ్‌, ‌ఛత్‌ ‌పూజ మరియు గురునానక్‌ ‌దేవ్‌ ‌జయంతి పండుగల సందర్భంగా ‘‘స్థానికం కోసం గళం విప్పాలని’’ ప్రజలను కోరారు.

Leave a Reply