Take a fresh look at your lifestyle.

భారత్‌ అం‌తర్గత వివాదాల్లో జోక్యం సహించం

  • అమెరికా తదితర దేశాలకు భారత్‌ ‌ఘాటు హెచ్చరిక
  • హిజాబు వివాదం దేశ అంతర్గత వ్యవహారమని వెల్లడి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 12 : తరగతి గదుల్లో హిజాబ్‌ ‌ధారణపై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని అమెరికా, తదితర దేశాలకు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వి•డియా ప్రశ్నలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ ‌బాగ్చి స్పందిస్తూ, ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతుందని, పరిపాలన, ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి, పరిష్కరిస్తుందన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో డ్రెస్‌ ‌కోడ్‌కు సంబంధించిన వివాదం న్యాయ పరిశీలనలో ఉందని, ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతుందని తెలిపింది. భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంది.

- Advertisement -

భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం, అదేవిధంగా ప్రజాస్వామిక లక్షణాలు, వాతావరణం, రాజ్య పరిపాలనలకు అనుగుణంగా వీటికి పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. భారత దేశం గురించి తెలిసినవారు ఈ వాస్తవాలను సరైన విధంగా అర్థం చేసుకోగలరని తెలిపింది. అమెరికా ఏమన్నదంటే…అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా రాయబారి రషద్‌ ‌హుస్సేన్‌ ఇచ్చిన ట్వీట్‌లో, మతపరమైన దుస్తులను ఎంపిక చేసుకునే సామర్థ్యం కూడా మత స్వేచ్ఛలో భాగమేనని తెలిపారు. పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, మహిళలు, బాలికలను అణగదొక్కడమేనని ఆరోపించారు.

హుస్సేన్‌ ఓ ఇం‌డియన్‌-అమెరికన్‌. ‌పాకిస్థాన్‌ ‌విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ‌ఖురేషీ స్పందిస్తూ, ముస్లిం బాలికలకు విద్యను నిరాకరించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంఈఏ ఈ వివరణ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు గురువారం ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల్లో పాఠశాలల్లోని తరగతి గదుల్లో మతపరమైన వస్త్రాలను ధరించవద్దని తెలిపింది. హిజాబ్‌, ‌కాషాయ కండువాలు, జెండాలు వంటివాటిని తరగతి గదుల్లో ధరించరాదని చెప్పింది. విద్యా సంస్థలను తిరిగి తెరవాలని, విద్యార్థులను తరగతులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Leave a Reply