Take a fresh look at your lifestyle.

తెలంగాణలో భారత్‌ ‌బంద్‌ ‌విజయవంతం

  • రైతుల పోరాటానికి మద్దతుగా నిలవాలి
  • అన్ని వర్గాలకు అఖిలపక్ష నేతల విజ్ఞప్తి

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి 4 నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ  రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో భారత్‌ ‌బంద్‌ ‌విజయవంతమైంది. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక, ఉద్యోగ, వ్యాపా,• విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు ఉద్యమానికి మద్దతు ఇవ్వడమంతో రాష్ట్రంలో బంద్‌ ‌సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు, రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహంచారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సుందరయ్య పార్క్ ‌నుంచి నారాయణగూడ వైఎంసిఏ చౌరస్తా వరకు భారీ ప్రదర్శనగా వచ్చి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలగాణ రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ, టి.సాగర్‌, ‌రంగన్న, అచ్యుత రామారావు, జక్కుల వెంకటయ్య, ఉపేందర్‌రెడ్డి, కన్నెగంటి రవి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, గోవర్ణన్‌, ‌పోటు రంగారావు, ఎంసిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి, కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌రాస్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌ ‌రెడ్డి, టిడిపి రైతు నాయకుడు వెంకట్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ  రైతుల నడ్డి విరిచే విధంగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. పంటలకు మద్దతు ధరలు గ్యారెంటీగా లభించే విధంగా చట్టం చేయాలని కోరుతూ దేశ రైతాంగం ఉద్యమం ప్రారంభించి 4 నెలలు గడచినా కేంద్ర పాలకులు నామమాత్రంగా చర్చలు జరిపి గాలికి వదిలేశారని విమర్శించారు.

పక్క రాష్ట్రం ఏపీలో పాలకులు బంద్‌కు పిలుపు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బంద్‌కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ, లేనిపక్షంలో దీర్ఘకాలిక ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ చట్టాలు అమలైతే రైతులు తాము ఆరుగాలం కష్టించి పండించిన పంటను ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరలకే అమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ఈ  పోరాటంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply