Take a fresh look at your lifestyle.

‌తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

47 గంటల 44 నిమిషాలు కొనసాగిన సమావేశాలు
‌తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈనెల 15న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు 9 రోజుల పాటు కొనసాగాయి.

అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు మొత్తం 47 గంటల 44 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ సమావేశాలలో సీఎం కేసీఆర్‌ ‌పీఆర్‌సిపై ప్రకటన చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో కొరోనా తీవ్రత దృష్ట్యా విద్యా సంస్థల తాత్కాలిక మూసివేతపై ప్రకటన చేశారు. ఈ సమావేశాలలో అన్ని పార్టీలకు చెందిన 75 మంది సభ్యులు ప్రసంగించారు. కాగా, శాసనసభలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.

Leave a Reply