Take a fresh look at your lifestyle.

ఒత్తిడులతో పెరుగుతున్న యువత ఆత్మహత్యలు

ఉద్యోగాలు రాక పలువురు నిరుద్యోగులు మరియు విద్యావ్యవస్థలో పోటీ ప్రభావం  కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. గత కొంత కాలంగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్తాపం చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖని కూడా రాశాడు.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్‌ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్‌ ‌ట్రైనింగ్‌ ‌పూర్తి చేసిన మహేష్‌ ‌కు ఉద్యోగం లేదు.

గత కొంత కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ దశలోనే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదరుచూస్తున్నారు. అయితే నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య సమయంలో సూసైడ్‌ ‌నోట్‌ ‌రాశాడు. నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కోరుతూ సీఎం కు లేఖ రాశాడా యువకుడు.ఏళ్లకేళ్లుచదువుతున్నా…నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత నిరాశలో ఉంది. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో పలువురి ఆత్మహత్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి.

కేవలం తొందరపాటుతో,క్షణికావేశంలో,మనకు వున్నదానికన్నఎక్కువ  ఊహించడం వలనో,
చిన్న చిన్న వయస్సులో ప్రేమ ప్రేమలో ఒడిపోతాననే  భయం,తండ్రి కొట్టాడని తల్లి తిట్టిందని,
చదువులో ఫెయిల్‌ ఆయ్యానని,ఇలా వందల సాకులతో జీవితాన్ని ముగిస్తున్నారు.చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.దేశంలో వివిధ కారణాలతో అభం శుభం తెలియని చిన్నారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 18 ఏళ్లు నిండకుండానే అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారనే లెక్కలు కలవరపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2020లో రోజుకు సగటున 31 మంది చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌?‌సీఆర్‌?‌బీ) తెలిపింది. వీరి బలవన్మరణాలకు కరోనా, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం కారణమని స్పష్టం చేసింది.

మన దేశంలో విద్యా వ్యవస్థ రానురాను ఒత్తిడులతో కూడుకొని ఉంటుంది. దాదాపుగా అందరి చదువులు మార్కుల వెనుక పరిగెత్తే చదువులే. దీనికి తోడు తల్లితండ్రుల, ఉపాధ్యాయుల ఒత్తిడి. సరిగా చదవకపోతే ఎక్కడ ఏ అవమానం జరుగుతుందో అన్న భయం నిత్యం విద్యార్థుల దైనందిన జీవితాల్లో భాగం అవుతుంది. ఇక 13-17 సంవత్సరాల మధ్య శారీరక మార్పులు, ఆలోచనల మార్పులు పిల్లల పై అధిక ప్రభావం చూపుతాయి. ఆ సమయంలో సరైన వ్యవస్థ వారికి అండగా లేకుంటే అది తీవ్ర వొత్తిడి కి గురి చేస్తుంది.ఈ మార్కుల గోల, పోటీ పరీక్షల ఉత్తీర్ణత విషయంలో ఒత్తిడి, ఒక వేళ మంచి స్కూల్స్, ‌కాలేజి లో చేరిన అక్కడ పోటీ తత్వం లో నలిగే విద్యార్థులు, యవ్వనంలో శారీరక మార్పులు, వాటిని కనీసం చర్చిండానికి ఇష్టపడని తల్లితండ్రులు, చదివే ప్రదేశాల్లో ఉపాధ్యాయులు కనీసం విద్యార్థుల మానసిక స్థితి గమనించకుండా కేవలం యంత్రాల లాగా పాఠాలు చెప్పడం, సరిగా మార్కులు రాకుంటే పిల్లల్ని హేళన చెయ్యడం, వెరసి వీటి అన్నింటి ప్రభావమే 2004 నుండి 2020 మధ్య కాలంలో 120000 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క 2020 లో 11300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ప్రతి 45 నిమిషాలకు ఒక ఆత్మహత్య అంటే రోజుకి 31-33 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తే తీవ్రంగా కదిలిస్తుంది.

మానవాళి అధిక మరణాల విషయంలో 8వ స్థానంలో ఉన్నవి ఆత్మహత్యలు.  ఇంత మంది భావి తరాలు చనిపోవడం అది ఒక్క మన దేశంలో అంటే ఇది తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. వ్యవస్థలు, తల్లితండ్రులు పిల్లల చదువులపై పెట్టే శ్రద్ధ వారి మానసిక స్థితి పై కూడా పెట్టాలి. ప్రతి పాఠశాలలోనూ, కళాశాలలోనూ కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్టు సేవలు వినియోగించుకోవాలి. అంతే కాదు పిల్లల ఆవేదనలు, వాళ్ళకి ఉన్న అపోహలు లేదా ఏదైనా ఆలోచనలు  చేసుకొనే వేదికలుగా ఇల్లు, కాలేజి లేదా స్కూల్‌ ‌ని తయారు చెయ్యాలి. ఈ సమస్యకు పరిష్కారం చూడకుండా ఇలానే విద్యా, కుటుంబ వ్యవస్థలు ముందుకు వెళ్తే ఈ సమస్య పెరగడమే కాదు, దేశానికి కావాల్సిన మరియు ఉపయోగపడే అతి విలువైన యువతని కోల్పోవాల్సి వస్తుంది. అందరూ యువత ఆత్మహత్యలపై తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.

–  పిన్నింటి బాలాజీ రావు హనుమకొండ
9866776286

Leave a Reply