Take a fresh look at your lifestyle.

అధికమవుతున్న ఎండ తీవ్రత

  • ప్రజలెవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దు
  • కలెక్టర్‌ ‌వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట, మే 22, ప్ర జాతంత్ర ప్రతినిధి) : జిల్లా లో ఎండ తీవ్రత రోజు రోజుకు తీవ్రంగా పెరుగు తుండటంతో జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించా లని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో ఏర్పా టుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు గత రెండు రోజులుగా వడిగాలులు ఎక్కువగా విస్తున్నయని, పనులు చేస్తున్నవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ పనులను నిర్వర్తించుకోవాలని సూచించారు. ప్రజలు బయటికి వస్తే తెలుపు రంగు, లేత వర్ణములు కలిగిన పలుచటి కాటన్‌ ‌దుస్తులు ధరించాలని, ముఖ్యంగా తలకు వేడి తగలకుండా టోపి లేదా తలపాగ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రత వలన వడ దెబ్బ తగిలిన వారు పలుచటి మజ్జిగ, గ్లూకోజ్‌ ‌నీళ్లు, చిటికెడు ఉప్పు, చెంచా చెక్కరను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని త్రాగాలని లేదా ఇంటిలోనే తయారు చేయబడిన ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణాన్ని తీసుకుంటే వడదెబ్బ నుండి ఉపశమనం కల్గుతుందని సూచించారు. జాతీయ వాతావరణ శాఖ ఈ నెల 24వరకు ఎండ తీవ్రతతోపాటు వేడి గాలులు వీస్తాయని తెలినట్లు తెలిపారు.

ముఖ్యంగా చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్దులు అనారోగ్యంతో ఉన్నవారు ఎండ ప్రదేశానికి వెళ్లకుండా ఉండాలని తెలిపారు. వడదెబ్బకు గురైన వారు ప్రాధమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రానట్లు అయితే వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అప్రమత్తంగా ఉండి వడదెబ్బ నివారణకు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Leave a Reply