Take a fresh look at your lifestyle.

భారీగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపు లీటరు పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంపు

అదనపు సుంకాల పేరుతో భారం మోపిన కేంద్రం
కొరోనా కష్టాల్లోనూ కేంద్రం ఆదాయంపై దృష్టి సారించింది. ప్రజలపై దరల దాడి మొదలు పెట్టింది. పెట్రోల్‌, ‌డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ ‌సుంకాన్ని పెంచింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గితే వాటి ఫలాలు ప్రజలకు అందకుండా చేసింది. భారీగా ధరలు పెంచి పెట్రోల్‌ ‌ఖరీదైన ఆయిల్‌ అన్న నిజాన్ని నిజం చేసింది. కొరోనాతో ఏర్పడిన లాక్‌డౌన్‌ ‌వల్ల వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. కానీ కేంద్రం ఈ సమయంలో ఎక్సైజ్‌ ‌సుంకాన్ని పెంచేందుకు నిర్ణయించింది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్‌ ‌డ్యూటీని పెంచారు. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటరుపై సుమారు రూ.10 నుంచి రూ.15 మధ్య పెరిగే అవకాశం ఉన్నది. దీనితో పాటు రోడ్డు సెష్‌ ‌రూపంలో అడిషనల్‌ ఎక్సైజ్‌ ‌డ్యూటీని కూడా పెట్రోల్‌, ‌డీజిల్‌పై లీటరకు 8 రూపాయలు పెంచనున్నారు. పెట్రోల్‌పై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ ‌డ్యూటీని రెండు రూపాయలు పెంచారు. డీజిల్‌పై రూ.5 పెంచారు. దీని వల్ల కేంద్ర ఖజానా భారీగా నిండనున్నది. పెరిగిన ఎక్సైజ్‌ ‌సుంకం ద్వారా సుమారు లక్షా 75వేల కోట్లు వచ్చేఅవకాశాలు ఉన్నాయి. రిటేల్‌ ‌ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. మొత్తంగా కేంద్రం పెట్రోలు, డీజిల్‌ ‌రేట్లను భారీగా పెంచేసింది.

పెట్రోల్‌, ‌డీజిల్‌పై అదనపు ఎక్సైజ్‌ ‌సుంకాన్ని, రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను పెంచుతూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన కొత్త రేట్లు బుధవారం ఉదయం 6 గంటలనుంచి అమలులోకి వచ్చాయి. గత మార్చి 21న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌ప్రారంభమైనప్పటినుంచి పెట్రోల్‌ ‌ధర లీటరుకు రూ.69.59గా కొనసాగుతుండగా, డీజిల్‌ ‌ధరకూడా రూ.62.29గానే ఉంది. కరోనా అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధుల సకరణకు ప్రభుత్వం మార్గాలను అన్వేషించే క్రమంలో ఈ చర్య తీసుకొంది. ఆర్థిక బిల్లులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సవరణలు తీసుకు వచ్చిన రెండు నెలల తర్వాత ప్రభుత్వం ఈ సుంకాలను పెంచడం గమనార్హం. ఢిల్లీలో పెట్రో ధరలు పెరిగాయి. దీనికి కారణం ఢిల్లీ ప్రభుత్వం వాల్యూ యాడెడ్‌ ‌టాక్స్(‌వ్యాట్‌)‌ను పెంచింది. దీని వల్ల లీటరు పెట్రోలుపై ధర రూ.1.67, డీజిల్‌పై రూ.7.10 పెరిగింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోలు ధర రూ.71.26కు చేరగా, ఇంతకుముందు ఈ ధర రూ.69.59గా ఉంది. డీజిల్‌ ‌ధర లీటరు రూ.69.39కి పెరగనుంది. ఈ డీజిల్‌ ‌ధర ఇంతకుముందు రూ.62.29 మాత్రమే. ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ ‌ను పెంచడం వల్ల వార్షికంగా రూ.900 కోట్ల మేరకు ఆదాయం రానుంది.

Leave a Reply