భారత్లో కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ విజృంభించి దేశాన్ని కలవరపెడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్ నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్ నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి 2,76 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో 1,86,517 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఒక్క రోజులో అత్యధికంగా కరోనా కొత్తకేసులు నమోద య్యాయి. ఢిల్లీలో సావోపాలో (బ్రెజిల్), శాంటియాగో (చిలీ), లిమా (పెరూ) నగరాల కంటే అత్యధిక కరోనాకేసులను నమోదయ్యాయి. లాటిన్ అమెరికాలోని ఈ మూడు మెట్రోపాలిటన్ నగరాలు గ్లోబల్ కోవిడ్ -19 హాట్స్పాట్లుగా ఉన్నాయి. జూన్ 23న న్యూయార్క్, మాస్కోలో నమోదైన కొత్త కేసులకు మించి ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి.