Take a fresh look at your lifestyle.

మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు

3043 మంది కొరోనా బాధితులు 
మరో 21 మంది చనిపోయినట్లు నిర్ధారణ
హైదరాబాద్ ,మే 24: రాష్ట్రంలో . లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు అమలు నేపథ్యంలో కొరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయనుకుంటున్న క్రమంలో సోమవారం పాజిటివ్ కేసులు మళ్ళీ పెరిగాయి. ఆదివారం 2242 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..సోమవారం 3 వేల 043 కేసులు నమోదు అయినట్లు మీడియా బులెటిన్ లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో 21 మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు.
మొత్తం 59 వేల 709 మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 3 వేల 043 మందికి కొరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 693 మంది కొరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా హాస్పిల్స్ ‌నుండి డిశ్చార్జ్ ‌కాగా 21 మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39వేల 206 కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా తెలంగాణలో 0.56 శాతం నమోదు అయింది. అలాగే కొరోనా నుంచి కోలుకున్న వారి శాతం దేశ వ్యాప్తంగా 88.7 శాతం ఉండగా  తెలంగాణలో 92.38 శాతం నమోదు అయింది.

Leave a Reply