Take a fresh look at your lifestyle.

వాహనాల వేగం పెంచారో… జేబులు ఖాళీ

increased vehicle speed....empty pockets
మూడోసారి జైలుకే
  • జిల్లాకు 2 లేజర్‌ ‌స్పీడ్‌ ‌గన్‌లు
  • జిల్లా వ్యాప్తంగా 10,870 కేసులు నమోదు
  • చలానా రూపంలో దాదాపు కోటి12 లక్షలు వసూలు

చేతిలో వాహనం ఉంది కదా అని వేగం పెంచారో జేబులు ఖాళీ కావడంతోపాటు జైలుకు పోవడం కూడా ఖాయం. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు సూర్యాపేట, కోదాడ రెండు డివిజన్‌లలో రెండు లేజర్‌ ‌స్పీడ్‌ ‌గన్నులను 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై 80కి.మీల కన్న అతివేగంగా వెళ్తే నేరుగా ఈ-ఛలానా ఇంటికి వస్తుంది. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రతి సంవత్సరం రాష్ట్ర పోలీస్‌ ‌శాఖ ఆదేశానుసరం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయిన కూడా వాహనదారులు మధ్యం సేవించి, పరిమితికి మించిన వాహనాలు నడపడంతో ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ ‌శాఖ ఎన్నో అవగాహన సదస్సులు, వాహనదారులకు కల్పిస్తునే ఉన్నారు. అతి వేగంగా వాహనం నడిపి 2 సార్ల ఈ-చలానా వచ్చిన తరువాత 3వ సారి జైలు వూసాలు, డ్రైవింగ్‌ ‌లైసెన్స్ ‌రద్దు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఆధునిక కాలంలో అతివేగమైన వాహనాలు రావడంతో పోలీసులు ఎన్ని హెచ్చరిక బోర్డులు, ఛలానాలు, జైలుకు పంపించిన మారడం లేదని వాపోతున్నారు. 65వ జాతీయ రహదారిపై ఎంతో మంది ప్రముఖులు, అమాయకులు అతివేగానికి బలైయ్యారు. మరియు నేడు యువత చెడు వ్యసనాలకు బానిసై మధ్యం సేవించి అతి ఖరీదైన స్పోర్టస్ ‌వాహనాలు స్నేహితులతో పోటీ పెట్టుకొని అతి వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు వేగాన్ని నియంత్రించేందుకు జాతీయ రహదారిపై స్టాపర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అతివేగంగా వాహనాలు నడిపిన వాహనదారులు 10,879మందిపై కేసులు నమోదు చేసి 1కోటి12లక్షల44వేల165రూపాయల ఈ-ఛలానా రూపంలో వసూలు చేశారు.  వాహనదారులు ఏది ఏమైన వాహనం ఉంది కదా అని వేగంగా వెళ్లరో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న అనే నినాదంతో ముందుకు సాగాలని మేధవులు కోరుతున్నారు.

Tags: increased vehicle speed….empty pockets

Leave a Reply