Take a fresh look at your lifestyle.

కోవిడ్‌-19 ‌విపత్తులో పెరిగిన ఆత్మహత్యలు

 ‘‘‌కొరోనా విజృంభనతో లాక్‌డౌన్లు, కొరోనా క్రమశిక్షణలు, విద్యాలయాలు మూసివేయడం, ఆన్‌లైన్‌ ‌క్లాసుల ప్రారంభం కావడం, గృహాలకు మాత్రమే పరిమితం కావడం లాంటి కారణాలతో విద్యార్థిలోకం మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు దారి తీయడం జరిగిందని నిర్థారించారు. దేశ విద్యాశాఖ సర్వేలో 29 మిలియన్ల విద్యార్థులు ఆన్‌లైన్‌ ‌సౌకర్యాలు అందక ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యలు అధికంగా రికార్డు అయ్యాయి. సాధారణంగా గత అనుభవాల ఆధారంగా 7-8 శాతం ఆత్మహత్యలు జరగాల్సి ఉండగా, 2020లో 21.2 శాతం వరకు పెరగడం గమనించారు.’’

(‘నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డస్ ‌బ్యూరో-2020’ విడుదల చేసిన ‘వార్షిక ప్రమాద మరణాలు, ఆత్మహత్యల’ తాజా నివేదిక ఆధారంగా)

2020 ఏడాది కోవిడ్‌-19 అకాలంలో రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయని, ఆత్మహత్యలు మాత్రం పెరిగాయనే కఠిన అధ్యయన ఫలితాలను ‘నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డస్ ‌బ్యూరో, యన్‌సిఆర్‌బి విడుదల చేసి ‘వార్షిక ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యల (ఆన్యువల్‌ ఆక్సిడెం టల్‌ ‌డెత్స్ అం‌డ్‌ ‌సూసైడ్స్)’ ‌తాజా నివేదికలో తేటతెల్లవ •య్యింది. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో విద్యార్థులు, చిరు వ్యాపారులు అధికంగా ఉన్నారనే విచారకర వాస్తవాన్ని గమనిం చారు. కేంద్ర ప్రభుత్వ హోం శాఖ గణాంకాల ప్రకారం భారత దేశంలో 2019తో పోల్చితే 2020లో 21.2 శాతం విద్యార్థులు, 16.5 శాతం వృత్తి/ఉద్యోగులు, 15.67 శాతం దినసరి కూలీలు, 11.9 శాతం పదవీ విరమణ పొందిన వారు, 11.65 శాతం నిరుద్యోగులు అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది.

National ‌Crime‌ ‌Ricordus Bureau

2020 జనవరి 01 నుంచి డిసెంబర్‌ 31 ‌వరకు దేశంలో 1,53,052 ఆత్మహత్యలు నమోదు అయ్యాయని, 1967 తరువాత అత్యధిక ఆత్మహత్యలు 2020లోనే జరిగాయనే కఠిన వాస్తవాన్ని బహిర్గత పరిచింది. 2020లో ప్రతి లక్ష జనాభాలో 11.3 ఆత్మహత్యలు రికార్డు కావడం, గత 10 ఏండ్లలో 2010లో మాత్రమే 11.4 నమోదు అయ్యాయని తెలుస్తున్నది. 2020లో 25.1 శాతం రోడ్డు ప్రమాద మరణాలు, 16.5 శాతం అగ్ని ప్రమాద మరణాలు (2019తో పోల్చితే) తగ్గడం గమనించబడింది. 2014లో 12 శాతం ఆత్మహత్యలు నమోదు కాగా 2020లో (దాదాపు రెట్టింపు) 24.6 శాతానికి పెరిగాయని గమనించారు. కొరోనా విజృంభనతో లాక్‌డౌన్లు, కొరోనా క్రమశిక్షణలు, విద్యాలయాలు మూసివేయడం, ఆన్‌లైన్‌ ‌క్లాసుల ప్రారంభం కావడం, గృహాలకు మాత్రమే పరిమితం కావడం లాంటి కారణాలతో విద్యార్థిలోకం మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు దారి తీయడం జరిగిందని నిర్థారించారు.

దేశ విద్యాశాఖ సర్వేలో 29 మిలియన్ల విద్యార్థులు ఆన్‌లైన్‌ ‌సౌకర్యాలు అందక ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యలు అధికంగా రికార్డు అయ్యాయి. సాధారణంగా గత అనుభవాల ఆధారంగా 7-8 శాతం ఆత్మహత్యలు జరగాల్సి ఉండగా, 2020లో 21.2 శాతం వరకు పెరగడం గమనించారు. 2019లో 10,335 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, 2020లో 14,825 ఆత్మహత్య మరణాలు నమోదు అయ్యాయి (7.4 నుంచి 8.2 శాతం పెరుగుదల). వృత్తి/ఉద్యోగులు 2019లో 12,725 ఆత్మహత్యలు జరుగగా, 2020లో 14,825 మరణాలు రికార్డు అయ్యాయి. వీధి వ్యాపారులు 26.1 శాతం, చిరు వ్యాపారులు 49.9 శాతం, స్వయం ఉపాధి పొందిన వారు 7.8 శాతం అధికంగా ఆత్మహత్యల బారిన పడి ప్రాణాలు వదిలారు. కోవిడ్‌-19 ‌విపత్తులో కుటుంబాలు ఆర్థిక వనరులకు, విద్యా వసతులకు దూరం కావడంతో మానసిక ఒత్తిడి పెరగడం, ఆత్మహత్యలకు పురికొల్పబడడం గమని ంచబడింది.

ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా పేదరికం (69 శాతం), నిరుద్యోగం (24 శాతం), మాదకద్రవ్యాలు/మద్యపానం (17 శాతం), వ్యాధులు (16 శాతం), కుటుంబ సమస్యలు (14 శాతం) లాంటి అంశాలు గమనించబడినవి. పరీక్షల్లో ఫేయిల్‌ ‌కావడం ద్వారా జరిగే ఆత్మహత్యలు 24 శాతం తగ్గడం గమనించారు. కొరోనా విపత్తు విధించిన 68-రోజుల లాక్‌డౌన్‌లతో రోడ్డు ప్రమాదాలు సహజంగానే తగ్గడం గమనించారు. ప్రమాద మరణాల్లో 40 శాతం రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2020లో 11 శాతం తగ్గుదల గమనించబడింది. 2020లో మ్నెత్తం 3,74,397 రోడ్డు ప్రమాద మరణాలు జరిగాయని, 2019లో 4,21,014 మరణాలు నమోదు కాగా, 2009 (3,57,021) తరువాత అతి తక్కువ నమోదు అయ్యాయని తేలింది. సహజ మరణాలు 9.1 శాతం తగ్గడమే కాకుండా వడగాలులు, వరదల కారణ మరణాలు కూడా తగ్గాయి. నీట మునగడం, అకాల మరణాలు, విషప్రయోగాలతో 2020 మరణాలు 2019తో పోల్చితే పెరగడం గమనించారు.

ఇండియాలో తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా 6,495 ఆత్మహత్యలు, యంపీలో 4,945, మహారాష్ట్రంలో 4,176, తెలంగాణలో 3,831 మరియు గుజరాత్‌లో 2,745 ఆత్మహత్యలు జరిగాయి. దినసరి కూలీల్లో 14.6 శాతం గృహిణులు, స్వయంఉపాధి పొందిన వారు 11.3 శాతం, రైతులు 7 శాతం, విశ్రాంత ఉద్యోగులు 1 శాతం ఆత్మహత్యలు చేసుకోవడం గమనించారు. 2020లో దినసరి కూలీలు 37,666 ఆత్మహత్యలు జరుగగా, 2019తో పోల్చితే 15.7 శాతం అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 2020లో గృహిణులు 22,374 ఆత్మహత్యలు చేసుకోగా, 2019తో పోల్చితే 4.8 శాతం అధికంగా మరణించారు. భారతీయ ప్రజలు ప్రమాదాలకు, ఆత్మహత్యలకు దూరంగా ఉంటూ, సమస్యల్ని అధిగమిస్తూ, జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని ఆశిద్దాం. తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆత్మహత్య కాదు అని గమనిద్దాం. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం.
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply