Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌సడలింపుతో పెరిగిన విద్యుత్‌ ‌వినియోగం

విద్యుత్‌ ‌డిమాండ్‌ను తట్టుకునేలా ఏర్పాట్లు
: పెరుగుతన్న ఎండల కారణంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో రోజురోజుకు విద్యుత్‌ ‌వినియోగం కూడా పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. మొనటి వరకు లాక్‌డౌన్‌ ‌కారణంగా డిమాండ్‌ ‌తగ్గింది. వివిధ సంస్థలు, కార్యాలయాలు మూతపడడంతో విద్యుత్‌ ‌వినియగం నిలిచి పోయింది. అయితే తాజాగా లాక్‌డౌన్‌ ‌సడలింపుతో మళ్లీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. మేలో ఎండలు పెరగడంతో గరిష్ఠ వినియోగానికి చేరుకున్నట్లు అధికారులు అంటున్నారు. వినియోగానికి తగిన విధంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. నగరంలో డిమాండ్‌కు తగిన విధంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎర్తింగ్‌, ‌జాయింట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. గత రెండేండ్లుగా నగరంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆ సమయంలో విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశాం.

విద్యుత్‌ ‌తీగలను చెట్లు అనుకుని ఉన్న చోట కవర్‌ ‌కండక్టర్‌లను బిగించాం. నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. వాస్తవంగా వేసవిలో అధిక విద్యుత్‌ ‌వినియోగం వల్ల తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కవర్‌ ‌కండెన్సర్లు వంటి వాటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. విద్యుత్‌ ‌తీగల్లో జాయింట్లు ఉన్నచోట లోడ్‌ ఎక్కువగా పడి తెగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా ముందస్తుగానే వాటిని సరి చేశారు. గతేడాది కంటే ఈ యేడు మార్చిలో దాదాపు మూడు మిలియన్‌ ‌యూనిట్ల నుంచి నాలుగు వరకు అధికంగా వినియోగం పెరిగింది. ప్రస్తుత ఏడాది మార్చి నెల ముగిసేసరికి 60 మిలియన్‌ ‌యూనిట్లకు చేరుకొనే అవకాశాలున్నాయి. విద్యుత్‌ ‌శాఖ నాలుగేండ్లుగా ఏడాదికి 2.60 లక్షల కొత్త సర్వీసులను మంజూరు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే పెరుగుతున్న లోడును తట్టుకునేందుకు వీలుగా నగరంలో సబ్‌స్టేషన్లకు ఏర్పాటు చేయడంతో పాటు పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి.. విద్యుత్‌ ‌లైన్లను ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో పెద్దగా విద్యుత్‌ అం‌తరాయాలు కలగడం లేదు.

Leave a Reply