Take a fresh look at your lifestyle.

మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు 

కొత్తగా మరో 2524 పాజిటివ్‌ ‌కేసులు.. 18మంది మృతి

‌తెలంగాణలో కొరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్న సమయంలో సోమవారం పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది.ఆదివారం 1801 నమోదు కాగా..సోమవారం 2524 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు  వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో  వెల్లడించింది.  గడిచిన 24 గంటల్లో 18 మంది కోవిడ్ తో మరణించారు.. 3,464 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసులు 5,78,351 కు పెరిగాయి. వీరిలో 5,40,986 మంది కోలుకున్నారు. ఇంకా 34,084 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3281 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 87,110 సాంపిల్స్  పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ ‌రికవరీ రేటు 93.53  శాతంగా ఉంది. మరణాలు రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది.

Leave a Reply