Take a fresh look at your lifestyle.

జూరాలకు పెరిగిన వరద ఉధృతి

20 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల
పూర్తిస్థాయి నీటమట్టానికి చేరువలో హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాలకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. వరద ఇలానే కొన్నాళ్లు సాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం లక్షా 35 వేల క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లోలో వొస్తుండగా లక్షా 59 వేల క్యూసెక్కులు ఔట్‌ ‌ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 వి•టర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.420 వి•టర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టిఎంసి లుగా ఉంది. ఈ ప్రాజెక్టులోని అన్ని యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

పూర్తిస్థాయి నీటమట్టానికి చేరువలో హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయం

- Advertisement -

నగర శివార్లలోని హిమాయత్‌సాగర్‌ ‌జలాశయం నిండుకుండలా మారింది. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమయ్యారు. హిమాయత్‌సాగర్‌ ‌గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సాగర్‌ ‌పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు. ప్రస్తుతం 1762 అడుగులుంది. దీంతో హిమాయత్‌సాగర్‌ ‌పరివాహక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులను జలమండలి అప్రమత్తం చేసింది.

Leave a Reply