Take a fresh look at your lifestyle.

రెండో డోసు కాలపరిమితి 12 నుంచి 16 వారాలకు పెంపు

  • అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఎన్‌టీఏజీఐ వెల్లడి
  • కోవాగ్జిన్‌పై ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇవ్వని ప్రభుత్వం
  • గర్భిణులు ప్రసవం తరవాత ఎప్పుడైనా వ్యాక్సిన్‌ ‌తీసుకునే అవకాశం

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‌రూపొందించిన కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రెండు డోసుల మధ్య వ్యవధి పెరిగింది. రెండో డోసు 12 నుంచి 16 వారాల మధ్యలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదివరకు 28 రోజుల నుంచి ఆరు వారాల వ్యవధిలో వేసుకోవాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. వాక్సిన్‌ అత్యుత్తమ ఫలితాల కోసం వ్యవవధి ఎక్కువగా ఉండాలని సూచించింది. కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చినవారు ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ ‌టెక్నికల్‌ అడ్వైజర్‌ ‌గ్రూప్‌ ఎన్‌టీఏజీఐ పేర్కొంది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్‌ ‌తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ ‌టెక్నికల్‌ అడ్వైజర్‌ ‌గ్రూప్‌ ‌సూచనలు చేసింది. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్ ‌రెండో డోసు వ్యాక్సిన్‌ ‌వేసుకోవాలని సూచించింది. కోవాగ్జిన్‌ ‌డోసుల మధ్య ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేసింది. కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి.

ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్‌ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ ‌మొదటి మోతాదు ఇచ్చిన తర్వాత కొరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ మోతాదు ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తున్నారు. చికిత్స సమయంలో ప్లాస్మా థెరపీ చేసిన రోగులకు కోలుకున్న 12 వారాల తర్వాత వ్యాక్సిన్‌ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ పేషెంట్స్‌కు నిర్దిష్ట నియమం అంటూ ఏం లేదు. కోలుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్‌ ‌మొదటి షాట్‌ ఇస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్‌ ‌లేదు. దుష్పభ్రావాలు లేకుండా ఉండాలంటే వ్యాక్సిన్‌కు గ్యాప్‌ ‌తప్పనిసరి అంటున్నారు.

టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్‌ ‌యాంటిజెన్‌ ‌టెస్ట్ అవసరం లేదని కూడా తెలిపారు. కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 12-16 వారాలకు పెంచాలి. ప్రస్తుతం, 4-8 వారాల మధ్య రెండు డోస్‌ ఇస్తుండగా.. లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం, 12 వారాల విరామం ఉంటే టీకా ప్రభావాన్ని 81.3 శాతంపెంచుతుందని తెలుస్తోంది. ఈ ప్రోటోకాల్‌ ‌బ్రిటన్‌లో అనుసరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు యాంటినెటల్‌ ‌సెంటర్లలో టీకాలకు సంబంధించిన లాభాలు, నష్టాలు గురించి తెలియజేయాలి. సైడ్‌ ఎఫెక్టస్‌పై ఒక బుక్‌లెట్‌ ‌వారికి అందించాలి. వారికి టీకా వేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. పాలిచ్చే తల్లులు డెలివరీ తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్‌ ‌తీసుకోవచ్చునని తెలిపింది. కొరోనా వైరస్‌ ‌నిరోధించేందుకు అందిస్తున్న కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రెండు డోసుల మధ్య సమయాన్ని 12 నుండి 16 వారాలకు పెంచవచ్చునని ప్రభుత్వ ప్యానల్‌ ‌గురువారం ప్రతిపాదించింది. కాగా, మరో వ్యాక్సిన్‌ ‌కోవాగ్జిన్‌ ‌మోతాదుల విషయంలో ఎలాంటి మార్పులను సూచించలేదు.

ఈ రెండు వ్యాక్సిన్లకు గతంలో మొదటి, రెండవ డోసులకు మధ్య అంతరం సుమారు నాలుగు నుండి ఆరు వారాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం కోవిషీల్డ్‌కు మాత్రమే నేషనల్‌ ఇమ్యునిజేషన్‌ ‌టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఈ ‌సిఫార్సు చేసింది. అదేవిధంగా గర్భిణీలకు వ్యాక్సిన్‌ ఎప్పు‌డు పొందాలో అవకాశాన్ని ఆమెకు వదిలేయాలని, ప్రసవం తర్వాత కూడా వారు వ్యాక్సిన్‌ ‌వేసుకునేందుకు అర్హులని పేర్కొంది. సార్క్-‌కోవిడ్‌ 2‌తో అనారోగ్యం బారిన పడి..కోలుకున్న వారికి ఆరు నెలల పాటు టీకాను వాయిదా వేయాలని ఎన్‌ఐటిజిఎ సూచించింది. ఈ సూచనలు అమలు చేసేందుకు తమ సిఫార్సులను నేషనల్‌ ఎక్స్‌ఫర్ట్ ‌గ్రూప్‌ ఆన్‌ ‌వ్యాక్సిన్‌ అడ్మినిస్టేష్రన్‌కు పంపించనుంది.

Leave a Reply