Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు

  • ప్రజల్లో పెరిగిన భరోసా
  • ఉద్యోగులకు మరింత మెరుగ్గా ఆరోగ్య పథక
  • శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి ఈటల

కేసీఆర్‌ ‌కిట్‌ ‌పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, దవాఖానాలపై భరోసా పెరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రభుత్వ దవాఖానాల ముఖ్చిత్రం మారిందన్నారు. ప్రూతి అయిన మహిళలకు కెసిఆర్‌ ‌కిట్‌ ఎం‌తగానో ఉపయుక్తంగా మారిందన్నారు. కెటిఆర్‌ ‌కిట్‌  ‌కింద లబ్దిదారుల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌సమాధానం ఇచ్చారు. కేసీఆర్‌ ‌కిట్‌ ‌పథకం వచ్చిన తర్వాత 50 శాతానికి పైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 11,91,275 మంది మహిళలు లబ్ది పొందారని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్రవరి) వరకు 2,58,341 మంది లబ్ది పొందారని పేర్కొన్నారు. ఈ పథకం కోసం 2017-18లో రూ. 246.38 కోట్లు, 2018-19లో రూ. 273.83 కోట్లు, 2019-20లో రూ. 392.04 కోట్లు, 2020-21(ఫిబ్రవరి) వరకు రూ. 263.65 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ  పథకం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రభుత్వానికి ఎంతో ఆదరణ లభించిందన్నారు. అమ్మ ఒడి వాహనాలను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. గర్భిణి స్త్రీలకు మంచి ఆరోగ్యం కోసం అంగన్‌వాడీల నుంచి పోషకాహారం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ ‌చెప్పారు. ఇదిలావుంటే శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌)‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్‌ ‌సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు, వారి కుటుంబాల సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు. దీని కింద రూ. 350 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ స్కీం కింద ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి.. మొత్తం 12 లక్షల 4 వేల 654 మందికి లబ్ది చేకూరుతుందన్నారు. ఓపీ, ఐపీ కేసుల సంఖ్య పెరుగుతుంది. వెల్‌నెస్‌ ‌సెంటర్ల ద్వారా ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. బకాయిల విషయంలో ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌కు ఒకసారి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈహెచ్‌ఎస్‌ ‌కింద రూ. 37 కోట్లు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ ‌చెప్పారు.

Leave a Reply