Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పెరిగిన రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 167 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు క్రితం రోజు కంటే పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 167 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 164 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 55 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 14 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,73,889 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,976కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,66,176 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,737గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply