Take a fresh look at your lifestyle.

పెరిగిన కొరోనా మరణాలు

ముందురోజు 911 మరణాలు..తాజాగా 1206 మరణాలు నమోదు
కేసుల సంఖ్యలో తగ్గుదల
త్రిపురలో డెల్టా వేరియంట్‌ ‌గుర్తింపు

కొరోనా కారణంగా రోజవారీ మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్రితం రోజు 911 మరణాలు నమోదు కాగా తాజాగా 24 గంటల్లో 1206 మరణాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గినప్పటికీ…మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,206 మంది చనిపోయారు. మరో 42,766 కొత్త కేసులు వెలుగుచూశాయి. ముందురోజుతో పోల్చుకుంటే కేసులు మాత్రం తగ్గాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో 3,07,95,716 మంది కొరోనా బారిన పడగా, 4,07,145 మంది మరణించారు. రికవరీ రేటు 97.20 శాతానికి చేరింది. 24 గంటల్లో 45,254 మంది కోలుకున్నారు. దీంతో ఆ సంఖ్య 2,99,33,538గా ఉంది. ప్రస్తుతం దేశంలో కేవలం 1.48 శాతం (4,55,033) మాత్రమే పాజిటివ్‌ ‌కేసులు ఉన్నాయి.

కేరళ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‌, ‌తమిళనాడు, ఒడిశాలో అత్యధిక కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటి వరకు 37.21 కోట్ల టీకా డోసులు వినియోగం అయ్యాయి. ఇదిలావుంటే త్రిపుర నుంచి జినోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌టెస్టింగ్‌ ‌కోసం పశ్చిమ బెంగాల్‌కు పంపించిన 152 శాంపిళ్లలో 90కిపైగా శాంపిళ్లు పాజిటివ్‌గా గుర్తించారు. ఈ కేసులన్నీ డాల్టా ప్లస్‌ ‌వేరియంట్‌కు సంబంధించినవని వైద్యులు నిర్దారణ చేశారు. దీంతో కొరోనా థర్డ్ ‌వేవ్‌కు ఇది సూచికగా నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా త్రిపురలోని కోవిడ్‌-19 ‌నోడల్‌ అధికారి డాక్టర్‌ ‌దీప్‌ ‌దేవ్‌ ‌మాట్లాడుతూ త్రిపుర నుంచి జినోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌కోసం 151 శాంపిళ్లు పంపగా వాటిలో 90కిపైగా శాంపిళ్లు డెల్డా వేరియంట్‌ ‌పాజిటివ్‌ అని గుర్తించారన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. దీనికిముందు కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో సార్స్-‌కోవ్‌-2 ‌కొరోనా వైరస్‌ ఆం‌దోళనకరంగా మారిందని ప్రకటించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌, ‌తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Leave a Reply