Take a fresh look at your lifestyle.

నగరంలో యధావిధిగా ట్రాఫిక్‌ ‌జామ్‌

2 ‌వరకు హడాగివిడా తిరిగిన ప్రజలు
నేటినుంచి మెట్రో రైళ్ల సమయం పెంపు
హైదరాబాద్‌,‌మే31: హైదరాబాద్‌లో యథావిధిగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌కొనసాగుతోంది. రిలాక్సేషన్‌ ‌సమయం పొడగించడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. రెండు గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద ఎత్తున రోడ్డుపై ప్రజలు తిరుగుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. రెండు గంటల నుంచి ఉదయం 6 వరకూ లాక్‌డౌన్‌ ‌కఠినంగా అమలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అయినా కొందరు 2 వరకు తిరుగుతూ కనిపించారు. తొలిరోజు కావడంతో పోలీసులు మరోమారు చూసీచూడనట్లు పోయారు.

ఇకనుంచి 1 తరవాత నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇదిలావుంటే జూన్‌ 1‌వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. నేటినుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

చివరి రైలు ఒంటి గంటకు బయల్దేరి 2 గంటల వరకు చివరి స్టేషన్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్‌ ‌సడలింపుల నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ ‌నుంచి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అన్ని రకాల ప్రజా రవాణాకు మరో గంట అదనంగా వెసులుబాటు కల్పించారు.

Leave a Reply