Take a fresh look at your lifestyle.

పత్తి కొనుగోలులో తేమ శాతం పెంచండి

ముంబయిలో సిసిఐ చైర్మన్‌ను కలిసిన మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5825కు వందశాతం  కొనుగోలు చేయడానికి  సీసీఐ ఎండీ హామీ ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. ఇటీవలి వర్షాలకు పత్తి చేలు బాగా తడిసిపోయాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత సీసీఐ 12 శాతం తేమ నిబంధన సవరించాలని సిసిఐని కోరినట్లు ఆయన తెలిపారు. నేటి నుండి నాలుగు  రోజుల పాటు మహారాష్ట్ర అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం ముంబయిలోని సీసీఐ కార్యాలయంలో కాటన్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీసీఐ) చైర్మన్‌ ‌ప్రదీప్‌ ‌కుమార్‌ అగర్వాల్‌తో సమావేశమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, వేర్‌ ‌హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌మందుల సామేలు, మార్కెటింగ్‌ ‌డైరెక్టర్‌ ‌లక్ష్మీబాయి తెలంగాణ రైతుల పక్షాన పలు డిమాండ్లు చేశారు.
2019 – 20 ఏడాదికి 49.56 లక్షల పత్తి బేళ్లను కాటన్‌ ‌కార్పోరేషన్‌ ‌నిలువ చేయగా అందులో 9.28 లక్షల బేళ్లను మాత్రమే తరలించడం జరిగిందని, మిగితా పాత నిల్వలను వెంటనే తరలించి, కొత్తగా కొనుగోలు చేసిన పత్తి నిల్వకు సహకరించవలసిందిగా వారు సిసిఐకి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply