Take a fresh look at your lifestyle.

దవాఖానల స్థాయిని పెంచుకోవాలి

  • వెంటిలేటర్లను సమకూర్చుకోవాలి

‌కరోనా వైరస్‌ ‌నివారణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ ‌మూడే మూడు ముక్కల్లో చెప్పారు. టెస్టింగ్‌, ‌టెస్టింగ్‌, ‌టెస్టింగ్‌ అని సమాధానం ఇచ్చారు. ప్రపంచ దేశాలు చాలావరకు వ్యాధి భవిష్యత్తు స్థితి ఎలా ఉంటుందని కేస్‌ ‌స్టడీలు చేసి పెట్టుకున్నాయి కానీ భారత్‌లో కలికానికి కూడా అది జరగలేదు. అమెరికాలో 2 వారాల క్రితం చేసిన అలాంటి కేస్‌ ‌స్టడీలో దాదాపు 10 లక్షల మంది అమెరికన్లు భవిష్యత్తులో కరోనాకు బలవుతారని తెలిసింది. కానీ వైరస్‌ ‌వ్యాప్తి నిరోధక కార్యాచరణ మొదలెట్టిన వారం తర్వాత అమెరికాలో భవిష్యత్తు మృతుల సంఖ్య గురించిన అంచనా తగ్గుముఖం పట్టింది. దీనికి అనుగుణంగానే భారత్‌లో భవిష్యత్తులో పెరగనున్న రోగులకు చికిత్స అందించడానికి దేశంలోని అన్ని ఆసుపత్రులను సిద్ధం చేయాలి. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచడం రోజుల వ్యవధిలో సాధ్యమయ్యే పని కాదు.

ఆసుపత్రుల్లో పడకల పెంపుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దక్షిణ కొరియా, జర్మనీ ప్రభుత్వాల కార్యాచరణ దీన్నే నిరూపిస్తున్నాయి. వివిధ రాష్టాల్ల్రో అవసరమైన అన్ని వెంటిలేటర్లు లభ్యమవుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. అన్ని జిల్లా కేంద్రాల్లోని వైద్యకళాశాలల వనరులను కరోనా రోగుల సేవకు కేటాయించాలి. వాటిలోని వైద్యులకు, విద్యార్థులకు టెస్టింగ్‌ ‌కిట్లు, వెంటిలేటర్లు తక్షణం అందచేసి వైరస్‌ ‌నివారణకు దిగాలని నిర్దేశిరచాలి. వ్యాధి నిర్దారణ పరీక్షలను విస్తృ తంగా చేపట్టడమొకటే కరోనా వైరస్‌ని అడ్డుకోగలదు. కొత్త భవంతుల నిర్మాణం కంటే ఉన్న ఆసుపత్రుల సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. అన్నిటికంటే మించి వెంటిలేటర్లను భారీస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి.కరోనా వైరస్‌ ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి సోకిన తర్వాత శ్వాస ఆడటం కష్టం. ఊపిరితిత్తులకు గాలి అందాలంటే, రోగి బతకాలంటే వెంటిలేటర్ల సహాయం తప్పనిసరి. అందుకే వెంటిలేటర్లు గరిష్టంగా అందుబాటులో ఉంచుకోవాలి.

Leave a Reply