మెదక్ జులై 28(ప్రజాతంత్ర ప్రతినిథి): మొక్కలు నాటి ప్రగతిని పెంచాలని అప్పుడే అభివృద్ధికి దోహదపడుతుందని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం మున్సిపల్ సిబ్బందితో జరిగింది చైర్మన్ మాట్లాడుతూ మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కలు నాటితే ఏపుగా పెరిగి వాతావరణ కాలుష్యం పోయి ప్రజా ఆరోగ్యం క్షేమంగా ఉంటుందని తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని రైతులు సంతోషంగా ఉంటారని కొనియాడారు.
మెదక్ పట్టణంలో జేయన్ రోడ్డులో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఇటీవల పర్యటించి మొక్కలు నాటాలని గుర్తు చేశారు. మెదక్‌లో మొక్కలు నాటాలని సిబ్బందికి తెలిపారు. పచ్చదనంతో పట్టణం ఉంటే ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మొక్కల పెంపుకోసం కోట్లాడి రూపాయలు వెచ్చింది రూపకల్పన చేస్తుందని తెలిపారు. హరితహారంతో మెదక్ సుందర నందనంగా మారుతుందని వివరించారు. మున్సిపల్ సిబ్బంది తమ విధిగా మొక్కలను నాటి ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్వ లక్ష్మీనారాయణగౌడ్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.