Take a fresh look at your lifestyle.

ఆక్సీజన్‌ ‌సరఫరా పెంచేందుకు..

  • దేశవ్యాప్తంగా 1500 పిఎస్‌ఏ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు
  • అందుబాటులోకి 4 లక్షల ఆక్సీజన్‌ ‌పడకలు
  • ఆక్సీజన్‌ ‌సరఫరా పెంపుపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

దేశవ్యాప్తంగా 1500కు పైగా పిఎస్‌ఎ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. పిఎమ్‌ ‌కేర్స్ ‌సహకారంతో ఏర్పాటు అయ్యే ఈ ప్లాంట్ల ద్వారా 4 లక్షలకు పైచిలుకు ఆక్సీజన్‌ ‌పడకలు అందెబాటులోకా రానున్నట్లు తెలిపారు. ప్లాంట్లు సాధ్యమైనంత త్వరలో పనిచేసేటట్టు చూడాలంటూ అధికారులను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆదేశించారు. ఆక్సీజన్‌ ‌ప్లాంట్లను నడపడం, నిర్వహించడంలో హాస్పిటల్‌ ‌సిబ్బందికి తగినంత శిక్షణ లభించేలా చూడాలని ప్రధాన మంత్రి సూచించారు. దేశవ్యాప్తంగా ఆక్సీజన్‌ ‌సరఫరా పెంచడంపై ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన శువ్రారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్లాంట్ల పనితీరును పర్యవేక్షించడం కోసం ఐఒటి వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. దేశవ్యాప్తంగా ఆక్సీజన్‌ ఉత్పత్తిని పెంచడం, ఆక్సీజన్‌ ‌లభ్యతలో పురోగతిపై సమీక్షించారు. దేశవ్యాప్తంగా పిఎస్‌ఎ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లను నెలకొల్పడంలో ప్రగతిని గురించిన సమాచారాన్ని అధికారులు ప్రధాన మంత్రికి తెలియజేశారు.

1500 ప్లాంట్లలో పిఎమ్‌ ‌కేర్స్ ‌తోడ్పాటుతో స్థాపిస్తున్న ప్లాంటులతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, పిఎస్‌ ‌యుల తోడ్పాటుతో స్థాపిస్తున్న ప్లాంటులు కూడా ఉన్నాయి. పిఎమ్‌ ‌కేర్స్ ‌తోడ్పాటు తో స్థాపిస్తున్న పిఎస్‌ఎ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు దేశం లోని అన్ని రాష్ట్రాలలోను, జిల్లాలలోను ఏర్పాటు అవుతున్నాయి. పిఎమ్‌ ‌కేర్స్ ‌తోడ్పాటుతో స్థాపిస్తున్న అన్ని పిఎస్‌ఎ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు ఒకసారి ప్రారంభమయ్యాఅంటే గనక 4 లక్షలకు పైచిలుకు ఆక్సీజన్‌ ‌సహిత పడకలకు ఆక్సీజన్‌ అం‌దించగలవు. ఈ ప్లాంట్లు వీలయినంత త్వరలో పనిచేసేటట్టు చూడాలని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయవలసిందిగా అధికారులను ప్రధాన మంత్రి ఆదేశించారు.

ఆక్సీజన్‌ ‌ప్లాంట్లను సాధ్యమైనంత తొందరలో పని చేయించేటట్టు చూసేందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులతో క్రమం తప్పక సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి తెలిపారు. ప్రతి జిల్లా లో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేటట్టు చూడవలసిందని కూడా అధికారులను ఆయన ఆదేశించారు. నిపుణుల ద్వారా ఒక శిక్షణ మాడ్యూల్‌ను రూపొందించడం జరిగిందని, దేశంలో సుమారు 8000 మందికి శిక్షణను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారులు ప్రధాన మంత్రికి వివరించారు. స్థానికంగాను, జాతీయ స్థాయిలోను ఈ ఆక్సీజన్‌ ‌ప్లాంటుల పని తీరు ను గమనిస్తూ ఉండటానికి ఐఒటి వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నియోగించాలని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఆక్సీజన్‌ ‌ప్లాంటుల పనితీరు ను పర్యవేక్షించేందుకు ఐఒటిని ఉపయోగిస్తున్న ఒక పైలట్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఆయన కు వివరించారు. ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్‌ ‌సెక్రటరి, కేబినెట్‌ ‌సెక్రటరి, ఆరోగ్య కార్యదర్శి, ఎమ్‌ఒహెచ్‌ ‌యుఎ కార్యదర్శి, ఇతర ప్రముఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply