Take a fresh look at your lifestyle.

మానసిక ఆరోగ్యంతో రోగ నిరోధక శక్తి పెరుగుదల

దేశ ప్రజలంతా కలిసి సంఘటితంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు చేస్తున్న యుద్ధంలో భాగంగా దేశంలె బస్సులు, రైళ్లు, విమానాలు, పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్టు , ప్రైవేటు ట్రాన్స్ ‌పోర్ట్ ‌మొత్తం ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. హోటళ్లు, థియేటర్లు, క్లబ్బులు, పబ్బులు, ఫంక్షన్లు అన్నీ బంద్‌. ‌దేశమంతా మార్చి 22 జనతా కర్ఫ్యూతో ప్రారంభమైనా లాక్‌ ‌డౌన్‌ ఇం‌కా కొనసాగుతూనే ఉంది. నెల రోజుల లాక్‌ ‌డౌన్‌తో కరోనా వ్యాప్తి నియంత్రించగలిగాం. ఇదే స్ఫూర్తిని మరింత కాలం కొనసాగిస్తే కరోనాను అదుపులో ఉంచగలుగుతాం కరోనా వైరస్‌ ‌మానవాళి మనుగడుకు అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. రోజురోజుకూ వైరస్‌ ‌ప్రభావం తీవ్రమవుతోంది. దగ్గినా.. తుమ్మినా..కాస్త ఒళ్ళు వేడెక్కినా అమ్మ బాబోయ్‌..ఇవి కరోనా లక్షణాలే అంటూ జనం భయంతో వణికిపోతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనుమానం వస్తే చాలు వారితో మాట్లాడటమే మానేస్తున్నారు. ఇటీవల డిల్లీలో జరిగిన ఆత్మబలిదానం చేసుకొన్న సంఘటనతో ఎంత మానసిక సంఘర్షణకు లోనవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచాన్ని ఇళ్లల్లో బంధించింది కరోనా. కరోనా సోకితే మృత్యువును కౌగలించుకున్నట్లే అనే భావనలు, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని ఇలాంటి విపత్కర సమయంలో తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ తనకు కరోనా సోకితే, సమాజంలో తలెత్తుకోకుండా ఉండాల్సి వస్తుందని, తమతో పాటు తమవాళ్లూ చనిపోతారన్న భయాందోళనలు మధ్య బతకడం కన్నా..చావడమే మేలని మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆత్మ బలిదానాలనుచేసుకుంటున్న అత్యంత హృదయవిదారకమైన సంఘటనలు జరుగుతున్నాయి.

అనవసర భయాన్ని వీదండి: ఏదో జరుగుతుందన్న భయం, నిద్రలేమి, గిల్టీ ఫీలింగ్‌, ‌పరధ్యానం, ఆకలిలేమి వంటి లక్షణాలతో బాధపడేవారు తమకు తాము ఒకసారి పరిశీలించుకోవాలి. మానసిక ఒత్తిడికి గురవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కరోనాను జయించాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు. అనవసర భయాలను వీదండి. ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం చేయండి. స్పూర్తి గా తీసుకోవాలి : దేశంలో కరోనా వచ్చిన నాటి నుంచి పారిశుద్ధ్యంలో భాగంగా ఆస్పత్రుల్లో రోగుల వార్డులను శుభ్రపరుస్తూ, రోడ్లను స్ప్రే చేస్తూ పని చేస్తున్న మున్సిపల్‌ ‌సిబ్బంది, నడిరోడ్లపై రేయింబవళ్లు కాపలా కాస్తున్న పోలీసులు, ఎండాకాలంలో గాలి కూడా ఆడని సింథటిక్‌ ‌బట్టలు వేసుకొని కోవిడ్‌ ‌వ్యాధి గ్రస్తులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, సపర్యలు చేస్తూ నర్సులు మరియు ఆస్పత్రి సిబ్బంది వంటి వారు కరోనా సోకుతుందోనన్న భయాందోళనల్ని పక్కన బెట్టి సేవాభావాన్ని చాటుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు ఏదో ఒక మూలన ఉన్న మనలోని భయాందోళనలు పూర్తిగా తగ్గుతాయి. కరోనా మీద మనదే విజయం అనే ధైర్యం కలుగుతుంది.

- Advertisement -

మానసిక ఆరోగ్యం ముఖ్యం: ప్రతి రోజూ కాలాన్ని శాసిస్తూ నిత్యం 24 గంటల పాటూ మిషిన్‌తో పోటీపడుతూ గడియ రికామ్‌ ‌లేకుండా పని చేసే సగటు మనిషికి లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా కొంత తీరిక సమయం దొరికింది. ఈ అదనంగా దొరికిన సమయాన్ని అందివచ్చిన అవకాశంగా భావిస్తూ వారి భవిష్యత్తు జీవితానికి పూల బాటకు వేసుకోవడానికి ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరితో గడపడానికి ప్రయత్నం చేయాలి. మనిషికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. కౌన్సెలింగ్‌ ‌తీసుకోండి : మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం తీసుకోవడానికి వెనుకడుగు వేయకండి. ఒక వేళ కరోనా వైరస్‌ ‌వ్యాప్తి గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నారని మీరు భావిస్తే వెంటనే మనస్తత్వవేత్తల సహాయం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకొంటూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మనసులో కలిగే భయాలను మరియు ఆందోళలను తగ్గించడానికి మనస్తత్వవేత్త కౌన్సెలింగ్‌ ‌చాలా వరకు దోహదం చేస్తుంది.

Dr Atla Srinivas Reddy
డా।। అట్ల శ్రీనివాస్‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,
‌చేతన సైకాలజికల్‌ ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌
9703935321

Leave a Reply