Take a fresh look at your lifestyle.

రైతుల ఆదాయం పెంపు..స్వచ్ఛ గ్రామాల నిర్మాణం.. లక్ష్యంగా పశువుల హాస్టళ్ల నిర్మాణం

  • పొన్నాలలో రాష్ట్రంలోనే తొలి సామూహిక పాడి పశువుల సముదాయం
  • ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

పాడి రైతుల ఆదాయం పెంపొందించడం, గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా నిర్మాణం చేయడం లక్ష్యంగా పొన్నాలలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాడిపశువుల సముదాయం నిర్మించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట మండలం పొన్నాలలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సామూహిక పాడి పశువుల సముదాయంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌ప్రారంభించారు. సముదాయ అవరణలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరంను ఆయన ప్రారంభించారు. సముదాయంలో ఏర్పాటు చేసిన చాఫ్‌ ‌కటింగ్‌ ‌షెడ్‌, ‌పిడకల తయారీ కేంద్రం, మిల్క్ ‌సేకరణ కేంద్రం, సిబ్బంది క్వార్టర్‌ , ‌కమ్యూనిటీ హాల్‌ ‌తదితర వసతులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలో దేశంలోనే తొలిసారిగా గొర్రెల కోసం హాస్టల్‌ ‌నిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు.

అదే స్ఫూర్తితో పొన్నాలలో పశువుల హాస్టల్‌ ‌నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు రావడంతో పొన్నాలతో పాటు మరి మరో 8 గ్రామాల్లో పశువుల హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రైతులకు అదనపు ఆదాయం చేకూర్చాలని లక్ష్యంతో భూమి ఉన్న పాడి రైతులకు ఎస్సీ కార్పొరేషన్‌ ‌ద్వారా గేదెలను పంపిణి చేశామని తెలిపారు. పశువుల హాస్టల్‌ ‌నిర్మాణం వల్ల ఆదాయం పెరగడం, స్వచ్ఛ గ్రామాల నిర్మాణంతో పాటు నాణ్యమైన పాలు రైతు కుటుంబాలకు, వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో పశువుల హాస్టళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పొన్నాలలో తొలిసారిగా పశువుల హాస్టల్‌ ‌నిర్మాణం చేశామన్నారు. ప్రారంభంలో కొన్ని బాలారిష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని, వాటిని అధిగమించేందుకు పాడి రైతులతో అధికారులు తరచుగా మాట్లాడాలన్నారు. పాల ధర పెంచేందుకు విజయ డైరీ అధికారులతో మాట్లాడుతానని తెలిపారు.

Leave a Reply