Take a fresh look at your lifestyle.

రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

సాగు చట్టాల రద్దుకు కేంద్రం విముఖత

‌రైతు సంఘాలతో బుధవారం కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సుమారు 5 గంటలకు పైగా కొనసాగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు అంశాలు ఎలాంటి కొలిక్కి రాలేదు. కేంద్రం ముందు రైతు సంఘాల ప్రతినిధులు దీనినే ప్రధాన డిమాండ్‌గా ఉంచగా, కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంది. దీంతో జవనరి 4న కేంద్రం మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. మద్దతు ధర విషయంపై కమిటీ ఏర్పాటు చేసే యోచనను కేంద్రం పరిశీలిస్తున్నది. వాయు కాలుష్య ఆర్డినెన్స్‌లో సవరణలకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్‌ ‌బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. రైతు సంఘాలతో చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతు సంఘాలతో జరిపిన చర్చల్లో కొంత మేర పురోగతి కనిపించిందని తెలిపారు.

- Advertisement -

కొత్త చట్టాలపై కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, కొత్త ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, కేంద్రంతో జరిపిన చర్చలు కాస్త సానుకూల ధోరణిలోనే సాగాయని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నదనీ, అందుకే చర్చలు అసంపూర్తిగా ముగిశాయని తెలిపారు. అయితే, కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ముందుగా అనుకున్న విధంగా ట్రాక్టర్‌ ‌ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. కేంద్రంతో చర్చలు జరిపిన ప్రతీసారి ప్రభుత్వ అతిద్యాన్ని నిరాకరిస్తున్న రైతులు తామే స్వయంగా భోజనం తెచ్చుకోగా, కేంద్ర మంత్రులు కూడా అదే ఆహారాన్ని తిన్నారు. భోజన విరామ సమయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌, ‌పీయూష్‌ ‌గోయల్‌, ‌రైతు సంఘాల ప్రతినిధులతో కలసి వారి భోజనాన్ని రుచి చూశారు.

Leave a Reply