వద్దు నోటుకు చోటు
ఇచ్చావంటే చేటు
రాజ్యాంగమిచ్చినది
సాటిలేనిది ఓటు
చూడకు పచ్చ నోటు
చూశావంటే వేటు
ఉత్తమ నేతల కొరకు
ఇవ్వుము కాస్త చోటు
అమూల్యమైన ఓటు
శక్తివంతం ఓటు
కక్కుర్తి పడ్డావా?
తప్పదు సిగ్గుచేటు
ఎత్తులు ఎన్నికలలో
పొత్తులు ఎన్నికలలో
అధికారము కోసము
నేతల ఎన్ని’కలలో’
ఓటరన్నా! యోచించు
ఎరలను ఆక్షేపించు
ఓటు ఆయుధంతో
పాలకులను శాసించు
– గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580