Take a fresh look at your lifestyle.

లక్ష్యాలను సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు : కలెక్టర్‌

Incentives villages, achieve goals,collectorరెండో విడత పల్లెప్రగతిలో డంపింగ్‌ ‌యార్డులు, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతల పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌పాటిల్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐనవోలు మండలంలోని గర్మిళ్ళపల్లి, ఉతడగూడెం, వెంకటాపూర్‌ ‌పంచాయితీలలో పర్యటించి పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ ‌యార్డులకు తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మాణాలను ఈ నెలాఖరులో పూర్తి చేయాలన్నారు. పల్లెలు పచ్చదనం, పరిశుభ్రత, వెల్లివిరిసేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు. ఇదే స్పూర్తితో ప్రజలందుకు భాగస్వాములై నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. ప్రతి పంచాయితీలో నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాగ్‌ ‌ఫిల్లింగ్‌ను వందశాతం పూర్తి చేయాలన్నారు.

నాటిన మొక్కలను బ్రతికించుటకు ట్రాక్టర్ల ద్వారా నీళ్ళుపోయాలన్నారు. డంపింగ్‌ ‌యార్డులు, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు, మొక్కలను పెంపకంలో నిర్ధేశించిన లక్ష్యాలను సాధించిన గ్రామపంచాయితీలకు అభివృద్ధికి ప్రోత్సాహకంగా రూ. 5లక్షల నుండి 15 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. డంపింగ్‌ ‌యార్డులు, వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని 130 గ్రామపంచాయితీలలో ఇప్పటి వరకు దాదాపు 126 డంపింగ్‌ ‌యార్డుల నిర్మాణ పనులు అయ్యాయని, అలాగే 127 వైకుంఠధామాలకు స్థల సేకరణ పూర్తికాగా అందులో 72 వైకుంఠధామాలను ప్రారంభించి, వివిధ దశలలో పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.

ఇప్పటికే పనులు ముమ్మరంగా చేపట్టామని వచ్చే నెలలో పూర్తిచేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గ్రామ పంచాయితీల్లో అధిక మొత్తంలో నర్సరీలను ఏర్పాటు చేశామని, వీటిలో ప్రజలకు ఉపయోగకరమైన పండ్ల మొక్కలకు కావల్సిన విత్తనాలను స్థానికంగా సేకరించాలన్నారు. జిల్లాలో 450 కిలోమీటర్ల పొడవున రోడ్లకు ఇరువైపుల సుమారు 1లక్ష 35వేల మొక్కలను నాటామని, వీటి సంరక్షణకు గ్రామ పంచాయితీలో వాచర్లను నియమించామన్నారు.

Tags: Incentives villages, achieve goals,collector

Leave a Reply