Take a fresh look at your lifestyle.

10‌న పార్లమెంట్‌ ‌కొత్త భవనానికి శ్రీకారం

  • శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
  • 2022 అక్టోబర్‌లోగా పూర్తయ్యేలా చర్యలు
  • రూ.971 కోట్ల ఖర్చుతో 64,500 చదరపు
  • టర్ల విస్తీర్ణంలో నిర్మాణం
  • నిర్మాణం చేయనున్న టాటా ప్రాజెక్టస్
  • ‌ప్రధానికి స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆహ్వానం

ప్రస్తుత పార్లమెంట్‌ ‌భవనం స్థానంలో కేంద్రం కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని నిర్మించబోతున్నది. ఈ నిర్మాణానికి సంబంధించి ఈ నెల 10న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన పార్లమెంట్‌ ‌భవనానికి సంబంధించిన డిజైన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా వెల్లడించారు. డిజైన్‌, ‌ప్లానింగ్‌ అం‌డ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థ నూతన పార్లమెంట్‌ ‌డిజైన్‌ను రూపొందించిందని ఓం బిర్లా తెలిపారు. కాగా, మొత్తం 64,500 చదరపు టర్ల విస్తీర్ణంలో రూ.971 కోట్ల ఖర్చుతో నూతన పార్లమెంట్‌ ‌భవనాన్ని నిర్మించనున్నారు. టాటా ప్రాజెక్టస్ ‌లిమిటెడ్‌ ‌కంపెనీకి ఈ భవన నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. ఈ మేరకు పార్లమెంట్‌ ‌కొత్త భవనం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ భారీ భవన నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్‌ 10‌న భూమిపూజ నిర్వహించేందుకు ప్రధానిని లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఆయన మోదీ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం ఓం బిర్లా కొత్త భవనానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.

పాత భవనం సరిపోవడం లేదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం 64,500 చదరపు టర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో భారీ సౌధాన్ని నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌, ‌ప్లానింగ్‌ అం‌డ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సంస్థ దీని ఆకృతులు రూపొందిస్తుండగా, టాటాసంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది. పనులను 2022 అక్టోబర్‌ ‌నాటికి పూర్తిచేయాలని కేంద్రం సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న భవనం కంటే 17వేల చదరపు టర్ల అదనపు విస్తీర్ణంలో పూర్తి అధునాతన వ్యవస్థలతో నిర్మిస్తున్న ఈ కొత్త భవనం భూకంపాన్ని సైతం తట్టుకొనేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా వెల్లడించారు. ప్రస్తుత పార్లమెంట్‌ ‌భవనం నిర్మించి వందేళ్లు పూర్తవుతోందని స్పీకర్‌ ఓం ‌బిర్లా తెలిపారు. బ్రిటష్‌ ‌కాలంలో దీనిని నిర్మించారు.

స్వతంత్ర భారత్‌లో కొత్త పార్లమెంట్‌ ‌భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొత్త భవనంలో ఆధునాతన భారత శిల్పకళా నైపుణ్యం దర్శనమిస్తుందని వెల్లడించారు. రానున్న కాలంలో సభ్యుల సంఖ్య పెరుగుతుందన్న ఆయన..ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ భారీ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా, 9వేల మంది పరోక్షంగా పాల్గొంటారని వివరించారు. నూతన పార్లమెంటు భవనంలో మొత్తం 1224 మంది సభ్యులు కూర్చునే విధంగా సీట్లను ఏర్పాటు చేయనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా వెల్లడించారు. అందులో లోక్‌సభ సభ్యుల కోసం సుమారుగా 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326కు పైగా సీట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. నూతన పార్లమెంట్‌ ‌భవనం పాత భవనం కంటే 17,000 చదరపు టర్లు ఎక్కువ విస్తీర్ణంలో ఉండంనుందని చెప్పారు. కొత్త భవనం దేశంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఓం బిర్లా తెలిపారు.

Leave a Reply