నేడు ఆదివారం నుంచి జరగనున్న క్రికెట్ టోర్నమెంటుకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
- మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో..సిద్ధిపేట స్టేడియం వేదికగా
60 టీమ్స్…800 మంది క్రీడాకారులు
హెచ్సిఏ సహకారంతో ఆన్లైన్ స్కోర్ బోర్డ్, అంపైర్స్
అంతర్జాతీయ స్థాయి నిబంధనలతో మ్యాచ్‌ల నిర్వహణ
కేసీఆర్ ట్రోఫి ఆవిష్కరణ.. క్రీడాకారుల పరిచయంతో
క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్న మంత్రి హరీష్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు(ఫిబ్రవరి 17)ను పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆధ్వర్యంలో సిద్ధిపేట వేదికగా ఆదివారం నుంచి జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియం వేదిక క్రికెట్ టోఫీ అట్టాహాసంగా ఆరంభం కానున్నది. 10రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ ట్రోఫికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనీ నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్ శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. కేసీఆర్ ట్రోఫీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయనీ, ఏర్పాట్లపై మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి తరహాలో ఈ కేసీఆర్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంత్రి హరీష్‌రావు చొరవతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సిఏ)సహకరంతో అంపైర్స్, ఆన్లైన్ స్కోర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఆదివారం సాయంత్రం మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ క్రెకేట్ మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభం కానుందన్నారు. మొదట ట్రోఫీ ఆవిష్కరణ, 60 టీమ్స్, 800 మంది క్రీడాకారులకు జర్సీ(డ్రెస్సులు)ల పంపిణీ, పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు.ఆదివారం నుంచి 10రోజుల పాటు జరగనున్న కేసీఆర్ క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రెకేట్ మ్యాచ్ జరుగుతుందన్నారు. అంపైర్స్దే తుది నిర్ణయమనీ, మ్యాచ్ నిర్ణిత సమయానికి రాని జట్టును తొలగించబడుతుందనీ, నియమ నిబంధనలు ఉల్లంఘించిన జట్టును, క్రీడాకారులను మ్యాచ్ నుండి తొలగించబడుతారన్నారు.
కేసీఆర్ కప్‌కు అనూహ్య స్పందన…
సిఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరిచుకుని మంత్రి హరీష్‌రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం, అనౌన్స్ చేసినప్పటి నుండి యువత, క్రీడాకారు నుంచి అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, మల్లిఖార్జున్ తెలిపారు. పట్టణ స్థాయిలోనే 60 టీమ్స్‌తో రాష్ట్రంలోనే ఇది పప్రథమంగా జరుగుతుందనీ, సిద్దిపేట క్రీడాకారులు క్రికెట్‌పై అభిమానానికి, మంత్రి హరీష్‌రావు క్రికెట్ స్టేడియం అభివృద్ధికి ఇది గొప్ప నిదర్శనం అని చాటి చెప్పారు. ఈ సమావేశంలో గ్యాదరి రవీందర్, జావేద్, బాసంగారి వెంకట్, మోహిజ్, శ్రీకాంత్ గౌడ్, జెడజ, కంటెం రాజు, నాగరాజు, ఈర్షద్ హుస్సేన్, అక్బర్, బాబా, నాయకం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.