- పేదల పిల్లలు ఇంగ్లీష్ డియంలో చదవకూడదా
- నారాయణ, చైతన్యలను కాపాడడమే బాబు లక్ష్యం
- టిడిపి తీరుపై మండిపడ్డ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలన్నదే వైసీపీ ప్రభుత్వ విధానమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇంగ్లీషు డియంలో తెలుగుదేశం పార్టీ నేతల పిల్లలు చదవడంలేదా? అని ప్రశ్నించారు. ఇంగ్లీషు డియం పిల్లలే చదువుకోవాలా? పేద పిల్లలు చదువుకోకూడదా? అని అన్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఎక్కడ చదువున్నాడని మంత్రి ప్రశ్నించారు. దేవాన్ష్‌ను తెలుగుడియంలో ఎందుకు చేర్చలేన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి మంచిపనికి కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన డియాతో మాట్లాడుతూ ప్రతి పేద బిడ్డ పోటీ ప్రపంచంలో మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంగ్లీషు డియం ప్రవేశపెట్టిందన్నారు. హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఒక్క టీడీపీ నేత అయినా ప్రజలకు సహాయం చేసిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అనవసరపు రాజకీయం చేస్తూ టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంగ్లీష్ డియం టీడీపీ నేతల కొడుకులు, మనవళ్లు మాత్రమే చదవాలా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ డియాన్ని వ్యతిరేకించే ఎల్లో డియా ప్రతినిధుల పిల్లలు, చంద్రబాబు మనవడు ఏ డియంలో చదువుతున్నాడో చెప్పాలన్నారు.
చంద్రబాబు మనవడిని ఎందుకు తెలుగు డియంలో చదివించడం లేదని మంత్రి అనిల్‌కుమార్ ప్రశ్నించారు. లోకేష్‌ను ఎందుకు అమెరికాలో చదివించారో చెప్పాలన్నారు. ఇక తన బినాలు నారాయణ చైతన్య సంస్థలను బతికించడానికి ఇంగ్లీష్ డియాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ ప్రపంచంలో ప్రతి పేదవానికి ఇంగ్లీషు డియం అందించాలని సీఎం జగన్మోహన్రెడ్డి భావించారని మంత్రి అనిల్‌కుమార్ గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పబ్లిసిటీకి దూరంగా పని చేస్తున్నారని.. కరోనా వైరస్‌పై ప్రతి రోజు సక్ష చేస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ పనితీరును జాతీయ డియా సైతం ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు డియా సమావేశాలు పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర •మ్ శాఖకు లేఖ రాశారా అని అడిగితే నిమ్మగడ్డ రమేష్ నోరు మెదపడం లేదన్నారు. డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే నిమ్మగడ్డ నోరు విప్పారని, విజయసాయిరెడ్డి అడిగిన మూడు ప్రశ్నలకు నిమ్మగడ్డ ఎందుకు సమాధానం చెప్పలేదని మంత్రి ప్రశ్నించారు. ఆ లేఖను ఎవరు డ్రాప్ట్ చేశారో, ఏ ఐడి అడ్రస్ నుంచి మెయిల్ వెళ్లిందో నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు బుర్ర ఎల్లో వైరస్‌తో నిండిపోయిందని మండిపడ్డారు. ప్రస్తుతం రెండు వేల కరోనా టెస్టులు చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో రోజుకు నాలుగు వేల కరోనా టెస్టులు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు కరోనా వైరస్ వస్తే ప్రభుత్వం దాస్తుందా? లేదా టీడీపీ నేతలకు వచ్చిన కరోనా కేసులను ప్రభుత్వం దాచి పెడుతుందా? ఎవరికి వచ్చిన కరోనా కేసులు దాచిపెట్టామో చంద్రబాబు చెప్పాలన్నారు. కమ్మవారు తలుచుకుంటే ఎవరు అయిపోరు, ప్రజలు తలుచుకుంటే ఎవరైనా అయిపోతారని అనిల్ కుమార్ అన్నారు. ప్రజలు తలుచుకున్నారు కాబట్టే చంద్రబాబు, రాయపాటి అయిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కనీసం 23 సీట్లు వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో 2 లేదా 3 సీట్లు వస్తాయని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.