- అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ ప్రకటన
- సమావేశాలు గురువారానికి వాయిదా
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక పక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే ఆశావహులకు కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది. సిఎం ప్రకటన తరవాత సభ్యుల సందేహాలకు కెసిఆర్ సమాధానం ఇచ్చారు.
అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. దళిత బంధుపై సుదీర్ఘ చర్చ అనంతరం శాసన సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. వొచ్చే బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కూడా కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లో ఉద్యోగాల నియామక పక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సిఎం పేర్కొన్నారు.