Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌సంక్షోభంలో .. పార్లమెంట్‌ ‌పునరాభివృద్ధి ప్రాజెక్టా…?

  • ప్రధాని మోడీకి విశ్రాంత సివిల్‌ ‌సర్వెంట్లు బహిరంగ లేఖ..
  • చారిత్రక వారసత్వానికి విఘాతం అంటూ ఆందోళన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హౌసింగ్‌ అం‌డ్‌ అర్బన్‌ అఫైర్స్ ‌మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరికి, అరవై మంది రిటైర్డ్ ‌సివిల్‌ ‌సర్వెంట్స్ ‌బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖలో, ఢిల్లీలో అత్యంత ప్రసిద్ధ చారిత్రిక ఆవరణ రాజ్‌ ‌పాత్‌ ‌లో ప్రణాళిక బద్దం చేసిన సెంట్రల్‌ ‌విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. మాజీ బ్యూరోక్రాట్లు, పునరాభివృద్ధి ప్రాజెక్ట్ ‌చారిత్రక ఆవరణ వారసత్వాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని, రాజ్‌ ‌పాత్‌ ‌కి వున్నా ప్రాచీన హితిహాసాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించారు. రాజ్‌ ‌పాత్‌ ‌పునరాభివృద్ధి ప్రణాళిక, తీవ్రమైన పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుంది అని మాజీ బ్యూరోక్రాట్లు తమ లేఖలో తెలిపారు.రిటైర్డ్ ఐఎఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపిఎస్‌ అధికారులు తాము ఏ రాజకీయ భావజాలానికి గాని సభ్యత్వాన్ని గాని పొందలేదని తెలుపుతు, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య సమస్యలపై ప్రభావం చూపే అంశాలపై దృష్టి పెట్టడానికి మాత్రమే ఈ లేఖ రాశామని స్పష్టం చేశారు.

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి అధిక నిధులు అవసరం అవుతున్న తరుణంలో కోవిద్‌ ‌సంక్షోభం దేశములో ఉండగా ఈ ప్రాజెక్టు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అనుకోవటం బాధ్యతారాహిత్యమని వారు పేర్కొన్నారు. సెంట్రల్‌ ‌విస్టా పార్లమెంటు పునర్నిర్మాణం ప్రాజెక్ట్ . ‌గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌కు చెందిన హెచ్‌సిపి డిజైన్‌, ‌ప్లానింగ్‌ అం‌డ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ఈ ‌ప్రాజెక్ట్ ‌కోసం ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. మూడు కిలోమీటర్ల పొడవైన సెంట్రల్‌ ‌విస్టా రాష్ట్రపతి భవన్‌ ‌నుండి ఇండియా గేట్‌ ‌వరకు వ్యాపించింది. మార్చి 20 న, భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం సెంట్రల్‌ ‌విస్టా ప్రాజెక్ట్ ‌కోసం 20,000 కోట్ల వ్యయంతో ఫునః రూపకల్పన చేసే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ విషయాన్ని మాజీ బ్యూరోక్రాట్లు తీవ్రంగా పరిగణించి రోమ్‌ ‌కాలిపోతున్నప్పుడు నీరో ఫిడ్లింగ్‌ ‌చేసినట్లు అనిపిస్తున్నది అని అన్నారు.

Leave a Reply