Take a fresh look at your lifestyle.

భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యుత్‌ ‌శాఖ అప్రమత్తం

ఉత్పత్తి, పంపిణీ, సరఫరాలకు అంతరాయం రాకుండా చర్యలు
ట్రాన్స్‌కో సిఎండి  దేవులపల్లి ప్రభాకర్‌రావు 

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్‌ ‌సంస్థ అప్రమత్తం అయ్యింది. ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలకు దిగింది. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో , జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ ‌పరిస్థితిపై సీఎండి ప్రభాకర్‌రావు సోమవారం సక్షా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పిడిసిఎల్‌, ఎన్‌పిడిసిఎల్‌ అధికారులతో మాట్లాడారు. విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలగకుండా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేయాలని కోరారు. నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్మమయగా విద్యుత్‌సరఫరా ఆపి వేయాలని, ముంపు తొలగిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. భారీ వర్షాలు వరదల వల్ల విద్యుత్‌ ‌వ్యవస్థకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు
తలెత్తాయి. కరీంనగర్‌ ‌జిల్లాలో 220 కెవి సామర్ధ్యం కలిగిన ఏడు టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయి. వరంగల్‌ ‌జిల్లాలో రెండుచోట్ల 33 కెవి సబ్‌స్టేషన్‌లు నీట మునిగాయి. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎస్‌పిడిసిఎల్‌ ‌పరిదిలో 54 గ్రామాలు నీట మునిగి ఉండడంతో ముందు జాగ్రత్తగా విద్యుత్‌సరఫరాను నిలిపివేసినట్టుచెప్పారు. వరద నీరు నిండిన ప్రాంతాలకు సంబంధించి ఎస్‌పిడిసిఎల్‌ ‌పరిధిలో 159 ,ఎన్‌పిడిసిఎల్‌ ‌పరిధిలో 89 మొత్తం 248 డిస్టిబ్య్రూటరీ ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ ‌సరఫరాను ముందు జాగ్రత్త చర్యగా నిలిపి వేశాము. ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు ఉన్నందున అప్పర్‌జూరాల, లోయర్‌ ‌జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో మొత్తం 1200 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌తగ్గినందున కెటిపిసి, సింగరేణి,కెటిపిఎస్‌ ‌తదితర ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించినట్టు సీఎండి ప్రభాకర్‌రావు వెల్లడించారు. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారంతా ఎక్కడ ఎలాంటి సమస్యవచ్చినా అందుబాటులో ఉండాలని సిఎండి సూచించారు.

Leave a Reply