Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది

  • కంటి వెలుగు వైద్య  శిబిరాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు.
  • ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు.  
  • 2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది.
  • ప్రభుత్వ  లక్ష్యం  … ‘‘అంధత్వ రహిత తెలంగాణ’’
  • ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు నిర్వహిస్తున్నారు….
  • 1500  వైద్య బృందాలు.  100 రోజుల కార్యక్రమం….
  • కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నిపుతున్నది.
  • ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ..
  • అవసరమైన వారికి ఉచితంగా  మందుల పంపిణీ…

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండోవ దశ కార్యక్రమం ఉన్నాధికారుల నిరంతర పర్యవేక్షణలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ నెల 19 వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాలు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ నెల 18 తేదిన ముఖ్యమంత్రి ఖమ్మం నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వైద్య శిబిరాలు కళకళలాడుతున్నాయి.

జిల్లా అధికారులు క్యాంపుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. వైద్య శిబిరాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. అందులో అవసరమైన వారికి 2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.  2018లో నిర్వహించిన కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమంలో రాష్ట్రం అత్యుత్తమ ట్రాక్‌ ‌రికార్డును సాధించింది, గత రికార్డును అధిగమించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1 .57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ ‌వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం వారంలో 5 రోజులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వైద్య బృందంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, 8 ‌మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి బృందంలో ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్‌ ‌వైజర్‌, ఇద్దరు ఏ ఎన్‌ ఎం ‌లు, ముగ్గురు ఆశా వర్కర్లు,  ఒక  కంప్యూటర్‌ ‌డేటా ఎంట్రీ ఆపరేటర్‌  ఉన్నారు. ప్రతి వ్యక్తికి కంప్యూటరైజ్డ్  ‌కంటి పరీక్షలు  నిర్వహిస్తున్నారు.ప్రతి వైద్య బృందానికి కంటి పరీక్షల నిర్వహణ కోసం  అవసరమైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్ ‌వేర్‌ ‌సహాయంతో  కంటి పరీక్షలు చేస్తున్నారు. ణజు• మరియు •చీవీలు  ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు.

కంటి పరీక్షల తర్వాత ఆదే వైద్య శిబిరంలో అక్కడికక్కడే రీడింగ్‌ ‌గ్లాసుల పంపిణీ చేస్తున్నారు. కంటి పరీక్షల నాణ్యతను నిర్ధారించడానికి ప్రతి జిల్లాకు నాణ్యత నియంత్రణ బృందాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఈ నెల జనవరి 19 నుండి జూన్‌ 15 ‌వరకు 16,556 ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ల  ఆద్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు -12,768, పట్టణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు -3,788 ఉన్నాయి. వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నది.ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో ,  పత్రిక విలేకరులకు ఆయా ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ల వద్ద , పోలీస్‌ ‌బెటాలియన్‌ ‌సిబ్బందికి వారి కార్యాలయాలలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

    – కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.  

Leave a Reply