Take a fresh look at your lifestyle.

రెండో  సర్వే కూడా చేపడుతున్నాం

త్వరలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌
‌సిద్ధిపేటకు నర్సింగ్‌ ‌కళాశాల
గజ్వేల్‌, ‌హుస్నాబాద్‌లలో కోవిడ్‌ ‌వార్డును ప్రారంభించండి
వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించిన  మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మే 20 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేటలో కొరోనా ఉధృతిని అరికట్టేందుకు ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఇంటింటా సర్వే నిర్వహించామనీ, ఇది మంచి ఫలితాలను సాధించడంతో రెండో సర్వే కూడా చేపడుతున్నామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్ర తన్నీరు హరీష్‌రావు తెలిపారు.  సర్వే ద్వారా  వ్యాధి లక్షణాలున్న వారిని  గుర్తించి సకాలంలో మెడికల్‌ ‌కిట్‌ అం‌దించి ప్రాథమిక వైద్య సేవలు అందేలా చూశామని మంత్రి తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్‌ ‌రేటు తగ్గిందన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రాథమిక దశలోనే వైద్యం అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పేషంట్లు  సీరియస్‌ ‌కాకుండా చూడడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం లేకుండా చూడగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కొరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో నిర్వహించిన సర్వే ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ ప్రధానమంత్రి ఈ సర్వేను దేశంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించాలని చెప్పడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు 5 లక్షల రెమిడిసివిర్‌ ఇం‌జక్షన్లు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. తాలూకా స్థాయిలోని ప్రభుత్వ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలలో ఎక్కడా కూడ రెమిడిసివిర్‌  ఇం‌జెక్షన్ల కొరత లేదన్నారు. అవసరమైనవారికి ఇంజెక్షన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఆక్సిజను కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్‌ ‌కొరత పేషంట్లు చనిపోయిన పరిస్థితి చూశామన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల తెలంగాణ లో ఎక్కడ కూడా  అలాంటి ఘటనలు జరగలేదని మంత్రి తెలిపారు. వాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ముందంజలో ఉందన్నారు. ఇప్పటివరకు 2,19,986 మందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చామని తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన వారిలో 98 శాతం మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. కోవిషిల్డ్  ‌రెండో తీసుకునే పరిమితి ఆరు వారాల నుంచి 12 వారాల లోపు పెంచడంవల్ల ప్రస్తుతం జిల్లాలో రెండో వ్యాక్సిన్‌ ‌తీసుకునేవారు ఎవరూ లేరన్నారు. సిద్ధిపేటలో ప్రభుత్వ దవాఖానాలో లో ఒక గంటకు వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తిచేసే ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటును సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాస్పిటల్స్ లో   కొరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఉన్న పేషెంట్లకు ఒక్కో పేషంట్‌కు రోజుకు 250రూపాయలు  వెచ్చించి క్వాలిటీ డైట్‌ను మూడు పూటలా పెడుతున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఒక నర్సింగ్‌ ‌కళాశాలలు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరిన వెంటనే సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల  నర్సింగ్‌ ‌కళాశాల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలోని గజ్వేల్‌, ‌హుస్నాబాద్‌లలో తక్షణమే కోవిడ్‌ ‌వార్డులను ప్రారంభించాలని వైద్య శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే వార్డులలో సరిపడా ఆక్సిజన్‌, ‌రెమిడిసివిర్‌, ‌మందులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

Leave a Reply