Take a fresh look at your lifestyle.

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో…. మరోమారు మావోయిస్టుల కలకలం

  • రహాస్యంగా డీజీపీ పర్యటన
  • మావోయిస్టు భాస్కర్‌ ‌డైరీలోని అంశాలపై ఆరా
  • అగ్రనేత గణపతి, మరో ముగ్గురి లొంగుబాటుపై చర్చించేందుకేనా ?
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మరోసారి మావోయిస్టుల కల కలం మొదలైంది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి రాష్ట్ర డీజీపీ

మహేందర్‌ ‌రెడ్డి ఆ జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, డీజీపీ పర్యటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం. గత నెలలో కుమ్రం భీం జిల్లాలోని తిర్యాణి అడవులలో మావోయిస్టులు రహాస్యంగా సమావేశమయ్యారన్న సమాచారంతో భారీ ఎత్తున కూంబింగ్‌ ‌నిర్వహించారు. అప్పటికే మావోయిస్టులు తప్పిచుకోగా పోలీసులకు మావోయిస్టు భాస్కర్‌ ‌డైరీ లభ్యమైంది. అక్కడి పరిస్థితిని బట్టి సమావేశంలో మావోయిస్టు అగ్రనేతలు సైతం పాల్గొన్నారని పోలీసులు అంచనా వేశారు. మావోయిస్టులు సమావేశమైన స్థలంలో లభించిన డైరీలోని సమాచారాన్ని విశ్లేశించిన పోలీసులకు ఆ ప్రాంతంలోని కొందరు రాజకీయ పార్టీల నేతలు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని ఎస్పీలతో సమావేశమై మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి మావోయిస్టులను రాష్ట్రంలోకి అడుగు పెట్టనిచ్చేది లేదనీ, మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాజాగా, మరోమారు డీజీపీ మహేందర్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జరిపిన కూంబింగ్‌ ‌సందర్భంగా లభించిన మావోయిస్టు భాస్కర్‌ ‌డైరీలో కొత్త రిక్రూట్‌మెంట్‌తో పాటు దళాలను బలోపేతం చేసే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయనీ, ఈ క్రమంలో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న భాస్కర్‌ను పట్టుకోవడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు ఇచ్చేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన సాగుతోందని సమాచారం.

భాస్కర్‌తో పాటు అతని దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా కూంబింగ్‌ ‌నిర్వహించడంలో భాగంగానే డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి ఏరియల్‌ ‌సర్వే కూడా నిర్వహించారని సమాచారం. మరోవైపు, మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ ‌గణపతి జన జీవన స్రవంతిలోకి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు అగ్ర నేతలు ఆనంద్‌, ‌వేణుగోపాల్‌ ‌కూడా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రానున్నట్లు ఈ దిశగా ఇప్పటికే అనారోగ్య కారణాలతో పాటు పార్టీ కేంద్ర నాయకత్వంతో ఇటీవల వచ్చిన విభేదాల కారణంగా ఆయన పోలీసులకు లొంగి పోవాలని భావిస్తున్నారని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే ఈ ముగ్గురు అగ్ర నేతలు ప్రభుత్వం ముందు లొంగుబాటకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనీ, రెండు మూడు రోజుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఎదుట లేదంటే కిషన్‌ ‌రెడ్డి ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా వీరంతా ఇంటిలెజన్స్ ‌బ్యూరోతో టచ్‌లో ఉన్నారనీ, ఈ అధికారుల నేతృత్వంలోనే ఈ ముగ్గురు అగ్ర నేతలు కేంద్ర హోం శాఖ ఎదుట సరెండర్‌ ‌కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో రహాస్య పర్యటన జరిపారని విశ్వసనీయ సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply