Take a fresh look at your lifestyle.

భవిష్యత్‌లో ధరణి పోర్టల్‌ ‌ద్వారానే రిజిస్ట్రేషన్లు

ప్రజలకు వారి ఆస్తులపై కల్పించాలన్నదే లక్ష్యం
డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన లేదు
దలారులను నమ్మి పైసలు ఇవ్వొద్దు
అధికారులతో సక్షలో మంత్రి కెటిఆర్‌

భవిష్యత్‌లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ ‌ద్వారానే జరుగుతాయని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. పేద, మధ్యతరగతి వారికి ఆస్తుల పట్ల హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన లేదని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకు పోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. హైదరాబాద్‌ ‌నగరం ఆరు సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేర్వేరు రంగుల్లో పాస్‌ ‌పుస్తకాలు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేసినట్లు వెల్లడించారు. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ ‌విస్తరిస్తోందని కేటీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని కేటీఆర్‌ ‌తెలిపారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దలారులను నమ్మవద్దని ఒక్క పైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మొత్తం పక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ ‌సూచించారు. తెలంగాణలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కారించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకుని వచ్చిందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ ‌గత ఆరేళ్లలో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని కేటీఆర్‌ ‌తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. సాగు భూములపై హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు. హైదరాబాద్‌ ‌ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాతని, ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని, ఆస్తుల నమోదుకు సంబంధించి దలారులను నమ్మొద్దని, ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని కేటీఆర్‌ ‌సూచించారు. ఈ మొత్తం పక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. జీహెచ్‌ఎం‌పీ ప్రధాన కార్యాలయం నుంచి గ్రేటర్‌ ‌పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు. ఈ సక్షా సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌కమిషనర్‌ ‌లోకేశ్‌ ‌కుమార్‌, ‌హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ ‌శ్వేతా మహంతి హాజరయ్యారు. వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కాలనీ సంఘాల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించి చర్చించారు.

Leave a Reply