Take a fresh look at your lifestyle.

చీమలపాడు దుర్ఘటనలో… ఇద్దరు వ్యక్తుల మృతిపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

  • తక్షణ వైద్య సాయానికి ఆదేశించిన సిఎం
  • అసవరమైతే నిమ్స్‌కు తరలించాలని మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం
  • పార్టీపరంగా అండగా ఉంటామన్న మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి సవి•పంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవడం బాధాకరమన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా నాగేశ్వర్‌ ‌రావులకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్నారు.

మృతులు, క్షతగాత్రుల గురించి మంత్రి హరీష్‌ ‌రావు ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే క్షతగాత్రులను నిమ్స్ ‌హాస్పిటల్‌కి తరలించి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై కేటీఆర్‌ ‌తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ ‌నేతలతో, అధికారులతో కేటీఆర్‌ ‌మాట్లాడారు. మృతుడి కుటుంబం, క్షతగాత్రులను ఆదుకుంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్‌ ఆదేశించారు.

Leave a Reply