Take a fresh look at your lifestyle.

కొన్ని ప్రాంతాల్లోనే .. కొరోనా తీవ్రత

  • పరిమిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌
  • ‌డియాతో ఎయిమ్స్ ‌డైరక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా

దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసుల సమూహ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలు లేవని ఎయిమ్స్ ‌డైరక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా తెలిపారు. హాట్‌స్పాట్లుగా మారిన కొన్ని నగరాల్లో మాత్రం కేసులు అధికంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఆయా ప్రదేశాల్లో మాత్రం స్థానిక స్థాయిలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ‌జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. డియాతో ఇవాళ రణ్‌దీప్‌ ‌మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ ‌కేసులు తారాస్థాయికి చేరినట్లు చెప్పారు. ఢిల్లీలో వైరస్‌ ‌కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరి.. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ ‌గరిష్ట స్థాయికి చేరాల్సి ఉందన్నారు. కొన్ని రాష్టాల్లో్ర వైరస్‌ ‌కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఆ రాష్టాల్రు మరికొంత సమయంలో గరిష్ట స్థాయికి చేరనున్నట్లు తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై మాత్రమే మొదటి దశ వ్యాక్సిన్‌ ‌ట్రయల్స్ ‌జరుగుతాయని ఎయిమ్స్ ‌డైరక్టర్‌ ‌వెల్లడించారు. 1125 శ్యాంపిళ్లను సేకరించామని, దాంట్లో 375 మందికి తొలి దశలో పరీక్షిస్తామన్నారు. 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న 750 మందికి రెండవ దశలో పరీక్షించనున్నట్లు రణ్‌దీప్‌ ‌తెలిపారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌తో పోలిస్తే దక్షిణ తూర్పు ఆసియా దేశాల్లో వైరస్‌ ‌మరణాలు తక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఎయిమ్స్ ‌డైరక్టర్‌ ‌వెల్లడించారు.

  • రక్తపరీక్షతో 20 నిముషాల్లోనే కొరోనా గుర్తింపు
  • ఆస్టేల్రియా శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

కొరోనా మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. ఆరు లక్షల మందికిపైగా కొరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు కొరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. వాటిలో ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీకి చెందిన జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న టీకా ముందంజలో ఉన్నది. అదేవిధంగా కొరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించి కూడా పలు సంస్థలు కొత్తకొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ ‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్తరకం రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఈ కొత్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తికి కొరోనా సోకిందా లేదా అనే విషయాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అంతేగాక ఈ కొత్తరకం పరీక్ష ద్వారా వైరస్‌ ‌సోకినవారినే కాకుండా కొరోనా బారినపడి కోలుకున్నవారిని సైతం గుర్తించవచ్చని మోనాష్‌ ‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్‌ ‌పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్ధిని కూడా కొరోనా పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల తమ పరిశోధకులు 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కొరోనా కేసులను గుర్తించినట్లు మోనాష్‌ ‌యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కొరోనా పాజిటివ్‌ ‌కేసులు ఎర్ర రక్తకణాల క్లస్టరింగ్‌కు కారణమవుతాయని, ఇకపై దాన్ని కంటితో సులభంగా గుర్తించవచ్చని యూనివర్సిటీ పేర్కొన్నది. ఈ పరీక్షను ఉపయోగించి పరిశీలకులు కేవలం 20 నిమిషాల్లోనే పాజిటివ్‌, ‌నెగెటివ్‌ ‌రీడింగ్స్ ‌పొందవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది.

Leave a Reply