Take a fresh look at your lifestyle.

‌పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా..

  • రేపు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్‌ ‌పిలుపు
  • పెట్రోల్‌ ‌బంకుల ముందు నిరసన ప్రదర్శనలు
  • పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల ఆందోళనలు
  • కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా నిరసన తెలుపాలని ఉత్తమ్‌ ‌పిలుపు

దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలకు నిరసనగా ఈ నెల 11న దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ ‌బంకుల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొంది. అదేవిధంగా దేశంలో కొండలా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కూడా పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు. ఫిబ్రవరిలో రూ.100 దాటిన పంజాబ్‌ ఈ ‌నిరసనలకు కేంద్ర బిందువుగా మారనుంది. కేంద్రం తీసుకువొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ద్రవోల్బణాన్ని కట్టడి చేయలేకపోతున్నామని రాజస్తాన్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ ‌సింగ్‌ ‌దోతస్రా అన్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌, అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని మండిపడ్డారు.

2014 ఏప్రిల్‌ ‌లో అంతర్జాతీయంగా క్రూడ్‌ అయిల్‌ ‌బ్యారెల్‌ ‌ధర 108 డాలర్లు ఉన్న సమయంలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ. 71, డీజిల్‌ ‌రూ. 57 మాత్రమే ఉందని, కానీ 2021లో క్రూడ్‌ ఆయిల్‌ ‌ధర బారల్‌కు 61 అమెరికన్‌ ‌డాలర్లకు పడిపోనప్పటికీ… దేశంలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ. 102.82, డీజిల్‌ ‌ధర రూ. 95.96గా ఉందని ఎద్దేవా చేశారు. గత కొన్ని నెలలుగా దేశంలో చమురు ధరలు పెరిగి సామాన్యుడి నెత్తిన భారంగా మారాయి. గత వారంలో మూడు రోజులు ధరలు పెరిగాయి. తాజాగా బుధవారం కూడా లీటర్‌ ‌పెట్రోల్‌, ‌డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 95.56కు చేరుకోగా…డీజిల్‌ ‌ధర రూ. 86.47కు చేరువైంది.

ఇక ఆర్థిక నగరి ముంబయిలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 101.76 నమోదు కాగా, డీజల్‌ ‌ధర రూ. 93.85గా ఉంది. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ గురువారం రాష్ట్రంలోని అన్ని పెట్రోల్‌ ‌బంక్‌ల ముందు ఆందోళన చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నిర్ణయించింది. 5 నెలల్లోనే 43 సార్లు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెంచారని, దీనికి నిరసనగా కోవిడ్‌ ‌నిబంధనల అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో కోరారు.

Leave a Reply