మహబూబ్ నగర్19 జూన్( ప్రజాతంత్ర ప్రతినిధి) రాబోయే ఐదు సంవత్సరాలలో మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాలలో నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీ లో సుమారు కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.మధురానగర్ కాలనీ లో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువకు శంకుస్థాపన చేశారు. మరో 15 లక్షల రూపాయల వ్యయంతో భగీరథ కాలనీ లో నిర్మించనున్న సిసి రోడ్డు ,మురికి కాలువకు శంకుస్థాపన చేశారు. న్యూ బాలాజీ నగర్ లో పది లక్షల రూపాయ ల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు, మురికి కాలువకు శంకుస్థాపన చేశారు.
రామ్ మందిర్ చౌరస్తాలో 74 లక్షల రూపాయ ల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించా రు. కొత్త చెరువు రోడ్డు లో 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. ఒకవైపు కరోనా కారణంగా పూర్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు బాధలు పడకుండా 24 గంటల ఉచిత విద్యుత్ ,తాగునీరు ,రేషన్ ఇవ్వటం జరిగిందని, ప్రత్యేకించి జిల్లాలో రేషన్ కార్డు లేని 20 వేల మందికి కరోనా లాక్ డౌన్ సమ యంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.అంతేకాక ఎవరైనా ప్రమాదవశాత్తు గాయపడినట్లయితే ఎల్ ఓ సి తో పాటు ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, చైర్మన్, తనతో సహా ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడం జరుగు తున్నదని ఆయన తెలిపారు. నిరుపేదలకు అవస• •మైన అన్ని కార్యక్రమాలను చేస్తామని ,అభివృద్ధిలో అందరూ కలిసిమెలిసి ఉండి సహకరించాలనికోరారు .ఈనెల 18న రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో హ్వైదేరాబాద్ లో జరిగిన మీటింగ్ సందర్భంగా పట్ట ణాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలో కూలంకషంగా చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ,భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు లు ధరించాలని,స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి మార్గం అని,కరోనా పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నియమాలు పాటించి ఎవరికి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకోసం జిల్లా కేంద్రంలో వారం రోజుల్లో రుణ మేళ ను ఏర్పాటు చేసి డిసిసి బ్యాంకు ద్వారా 70 పైసల వడ్డీతో రూ.60 కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.చిరు వ్యాపారులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వడ్డీ వ్యాపారస్తులవద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇబ్బంది పడవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని మహిళా సంఘాలకు ఇటీవలే 8 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు అభివృద్ధిని ప్రజాప్రతినిధులకు వదిలి వేయాలని, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ,కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అదనపు కలెక్టర్ మోహన్ లాల్,మున్సిపల్ చైర్మన్ కె .నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ ,డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,వార్డు కౌన్సిలర్ లు రష్మిత,శ్రీనివాసులు, బురుజు సుధాకర్ రెడ్డి ,పద్మ ,ప్రశాంత్, గోవింద్ ,మున్సిపల్ కమిషనర్ సురేందర్ తదితరులు ఉన్నారు.