Take a fresh look at your lifestyle.

‌ప్రతీ మున్సిపాలిటీలో మాస్టర్‌ ‌ప్లాన్‌

“మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌సిద్ధం •పట్టణప్రజల జీవనప్రమాణాలు పెంచడం లక్ష్యం •సమస్యల పూలదండలు, అభినందనలు•హొస్వీకరించిన మంత్రి కేటీఆర్‌”

Municipal elections, taking challenge, ktr diya chitchat, kolluru
మున్సిపాలిటీలన్నింటిలో మాస్టర్‌ప్లాన్‌లు రూపొందించేందుకు రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిష్ట్రేషన్‌శాఖ సిద్ధమైంది ఎన్నికైన మున్సిపల్‌ ‌చైర్మన్‌లు, వార్డు సభ్యులు, తెలంగాణభవన్‌లో వరుసగా రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిష్ట్రేషన్‌ ‌శాఖ, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ను కలిసి విజ్ఞాపనలను అందచేస్తున్నారు. కొత్తగా ఎన్నికైనవారిని అభినందించడంతోనే వారు అక్కడి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకవస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యలన్నీ పరిష్కరించేవిధంగా హొఅన్నీ మున్సిపాలిటీలలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను, మాస్టర్‌ప్లాన్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రతీ మునిసిపాలిటీలో అక్కడి అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను హొతయారుచేయాలని ఆదేశాలను ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్‌, ‌స్థానికసంస్థల్లో విజయఢంకా మోగించి సంతోషంలో హొఉన్న టీఆర్‌ఎస్‌ ‌పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలకు కార్యాచరణ రూపొందించే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ దిశలో భాగంగానే 128 మునిసిపాలిటీల్లో, 13 కార్పొరేషన్‌లలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించనున్నారు. వీటిలో 120 మునిసిపాలిటీలో, 10 కార్పొరేషన్‌లలో ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. పాత పురపాలకసంఘాలు 51వరకు చాలా వాటిలో 1971కి పూర్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను తయారు చేశారు. ప్రధానంగా మునిసిపాలిటీల ఆదాయవనరులను అంచనా వేయనున్నారు.ప్రతీ పట్టణంలో మెరుగైన జీవనప్రమాణాలు కల్పించాలని, పర్యావరణసుస్థిరతను కాపాడాలని,వనరులను సమగ్రంగా వినియోగించుకోవాలని, అన్నీ విభాగాలను సమన్వయం చేయాలని, పట్టణపౌరులందరికీ సమానఅవకాశాలు ఉండాలని ఆటస్థలాలు, విహారయాత్రలు, పర్యాటకస్థలాలు, గ్రంథాలయాలు, పకడ్బందీరక్షణవ్యవస్థ,పట్టణపౌర సమన్వయసంఘాలు తదితర అంశాలన్నింటికీ ప్రాధాన్యాలను ఇచ్చి ప్రణాళికలను•హొరచించాలని భావిస్తున్నారు.

కొన్ని పట్టణాల్లో హొ హొ హొ హొ1990కి పూర్వం రూపొందించిన ప్రణాళికలనే అమలు చేస్తున్నారు. కాలక్రమంలో అన్నీ పట్టణాల్లో జనాభా పెరిగింది. ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అర్థశతాబ్ద అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌లను సిద్దం చేయాలని సూచిస్తున్నారు.కరీంగనగర్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట వంటి హొమునిసిపాలిటీలకు అనూహ్యంగా వలసలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌, ‌వరంగల్‌అర్బన్‌ ‌వంటి మహానగరాలకు పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకొని మహానగరాలకు వలసలు తగ్గించేవిధంగా ప్రతీపట్టణంలో అన్నీ సదుపాయాలను పెంపొందించాలని ఆలోచనలు జరుగుతున్నాయి. పట్టణప్రజలు పాఠశాలలు, దవాఖానాలు, రైతుబజార్‌లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, పరిశుభ్రత, రహదారులు, మంచినీటిసదుపాయం, నిరంతరవిద్యుత్తు,మురుగునీటివ్యవస్థ పంపిణీ, వర్షపునీరు కాల్వలు, కమ్యూనిటీసెంటర్లు వంటి ప్రాథమిక సదుపాయాలను కోరుతున్నారని ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలలో ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.మిషన్‌భగీరథ ద్వారా మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌, ‌వరంగల్‌,‌కరీంనగర్‌ ‌వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వందల సంఖ్యలో కాలనీలకు మంచినీరు అందడం లేదని, ట్యాంకర్లద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికితోడు జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మహారాష్ట్ర, రాజస్తాన్‌, ‌చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌జార్ఖాండ్‌, ‌కర్నాటక ప్రాంతాలనుంచి వలసజనం వస్తున్నారు. చాలా వరకు ఫూట్‌పాత్‌లమీదన్‌ ‌జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రతీపట్టణంలో గ్రంథాలయాలు శిథిలమైపోవడం, రవీంద్రభారతి వంటి సమావేశమందిరాలు, టౌన్‌హాల్స్ ‌లేకపోవడం తీరని సమస్యగా ఉన్నది. ప్రతీ 50వేల జనాభాకు ఒక సాంస్కృతిక కేంద్రం,లేదారిక్రియేషన్‌ ‌సెంటర్‌ ఉం‌డాలని నిబంధనలు తెలియచేస్తున్నాయి. పట్టణాలలోని చారిత్రక ప్రదేశాలను, వారసత్వకట్టడాలను, పురాతన దేవాలయాలను ప్రత్యేకంగా గుర్తించాలని,పట్టణ అభివృద్ధిప్రణాళికలలో వీటికి ప్రాధాన్యతను ఇవ్వాలని ఆర్కియాలోజీ నిబంధనలను తెలియచేస్తున్నాయి.•హొ హొ హొసిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో పట్టణంలోని చెరువులను మినీటాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దిన తరహాలోనే పట్టణాలకు సమీపంలోని చెరువులను మినీటాంక్‌బండ్‌ల మాదిరిగా రూపొందించే ఆలోచనలు జరుగుతున్నాయి. అదేవిధంగా కేంద్ర సాంస్కృతికశాఖ,పట్టణాభివృద్ధిశాఖల నుంచి నిధులు సేకరించి కొత్త కార్పొరేషన్‌లన్నింటిలో శిల్పారామాలను ఏర్పాటు చేయాలని ఆలోచనలు జరుగుతున్నాయి. హొఇక హైదరాబాద్‌ ‌రంగారెడ్డిల చుట్టూ కొత్తగా వచ్చిన బడంగ్‌పేట్‌, ‌మీర్‌పేట్‌, ‌బండ్లగూడాజాగీర్‌,‌బోడుప్పల్‌, ‌ఫీర్జాదీగూడా, జవహర్‌నగర్‌,‌నిజాంపేట కార్పొరేషన్‌లలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రచనల కోసం ప్రత్యేకంగా కన్సట్టెన్సీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే పట్టణాలో చాలా హొఅభివృద్ధి పనులు వివిధ శాఖల ద్వారా జరుగుతున్నాయి.ఈ పనులన్నింటినీ సమన్వయం చేసి ప్రతీపట్టణంలో అధికారులు మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌సారథ్యంలో హొఒక అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఫిర్యాదుకు జవాబుదారీగా ఉండేవిధంగా వ్యవస్థను రూపొందిస్తారు.

Tags: each municipality, Master Plan, ktr, municipl;a

Leave a Reply