Take a fresh look at your lifestyle.

శవ రాజకీయాలొద్దూ… దోషులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి హరీష్‌రావు

వర్గల్‌ ‌మండలంలోని వేలూరుకు చెందిన  దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.  మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు మంత్రి హరీష్‌రావు గజ్వేల్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…దళిత రైతు నర్సింలు మృతి బాధాకరమనీ,  ఇది విపక్షాల రాజకీయ ప్రేరేపిత హత్య అని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు.  శవాలపై పేలాలు ఏరుకునే విధంగా విపక్షాలు  నీచ రాజకీయాలు చేయొద్దన్నారు.  స్వలాభం  కోసం అమాయకులను బలి పశువులు చేయొద్దనీ,  వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని విపక్ష నేతలకు సూచించారు.

మృతుడి భూమిని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు బలవంతంగా తీసుకుందనే ఆరోపణలల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.  మృతుడి భూమిని కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయంలోనే విద్యుత్‌ ‌స•బ్‌ ‌స్టేషన్‌ ‌కోసం స్వాధీనం చేసుకున్నారన్నారు. వాస్తవం ఇలా ఉంటే..విపక్షాలు మాత్రం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని, ప్రభుత్వాన్ని బదునాం చేసే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.  మృతుడి కుటుంబానికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందనీ, ఎక్స్‌గ్రేషియా తో పాటు ఎకరం భూమి, తక్షణ సహాయంగా 2 లక్షల రూపాయలు అందజేస్తున్నామనీ, మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తామన్నారు.  రైతు నర్సింలు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపించి,  దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామనీ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply