Take a fresh look at your lifestyle.

జిల్లా సహకార బ్యాంక్‌లన్నింటిలో టీఆర్‌ఎస్‌ ‌హవా

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌విజయం
రాష్ట్రంలోని జిల్లా సహకార సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌డీసీసీబి, జిల్లా సహకార మార్కెటింగ్‌ ‌సొసైటీ (డీసీఎంఎస్‌) ‌లన్నింటిలో టీఆర్‌ఎస్‌ ‌విజయాన్ని సాధించింది. శనివారం అన్నీ జిల్లా కేంద్రాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు జరిపారు. వీటన్నింటిలో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి జిల్లాల వారీగా విజేతల వివరాలను పరిశీలిస్తే కరీంనగర్‌ ‌జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్‌రావు, వైస్‌చైర్మన్‌గా పింగళిరమేశ్‌ ఎన్నికే• ఏకగ్రీవమయ్యింది. ఈ జిల్లా డిఎస్‌ఎం‌స్‌ ‌చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌గా ఫకృద్దీన్‌ ఎన్నికయ్యారు.వరంగల్‌ ‌జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌,‌ వైస్‌చైర్మన్‌ ‌కుందూరు వెంకటేశ్వరెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంస్‌చైర్మన్‌గా గుగులోతు రామస్వామినాయక్‌ను వైస్‌చైర్మన్‌గా దేశిడిశ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడిమమేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌గా వట్టి జానయ్యయాదవ్‌,‌వైస్‌ ‌చైర్మన్‌గా రుర్గంపూడి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.నిజామాబాద్‌ ‌జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పోచారం భాస్కర్‌రెడ్డి,వైస్‌చైర్మన్‌గా రమేశ్‌రెడ్డిలను ఎన్నుకున్నారు.అదేవిధంగా నిజామాబాద్‌ ‌డీఎస్‌ఎంఎస్‌ ‌చైర్మన్‌గా సాంబారి మోహన్‌, ‌వైస్‌చైర్మన్‌గా ఏదుల్లా ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు.ఆదిలాబాద్‌ ‌డీసీసీబీ చైర్మన్‌గా నాందేవ్‌కాంబ్లే,వైస్‌చైర్మన్‌గా రఘునందన్‌రెడ్డి ఎన్నికయ్యారు.డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌గా తిప్పనిలింగయ్య,వైస్‌చైర్మన్‌గా కొమురం మాంతయ్య లను ఎన్నుకున్నారు.రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా బి,మనోహర్‌రెడ్డి,వైస్‌చైర్మన్గఆ సత్తయ్య ఎన్నికయ్యారు.డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌గా కృష్ణారెడ్డి,వైస్‌చైర్మన్‌గా మధుకర్‌రెడ్డిలను ఎన్నుకున్నారు.

మెదక్‌డీసీసీబీ చైర్మన్‌గా చిట్టిదేవేందర్‌రెడ్డి,వైస్‌చైర్మన్‌గా పట్నం మాణిక్యం ఎన్నికయ్యారు.ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కూరాకుల నాగభూషణం,వైస్‌చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌గా రాయల వెంకటశేషగిరిరావు,వైఎస్‌ ‌చైర్మన్గఆ కొత్వాల్‌ శ్రీ‌నివాస్‌ ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌ ‌డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా, వైస్‌చైర్మన్‌గా వెంకటయ్య ఎన్నికయ్యారు. డీసీఎంస్‌ ‌చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డిని, వైస్‌చైర్మన్‌గా హర్యానాయక్‌ను ఎన్నుకున్నారు. 15న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 905 సొసైటీలకు ఎన్నికలు జరుగగా, 810 సొసైటీలలో టీఆర్‌ఎస్‌ ‌బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఈ వరుసలోనే డీసీసీబి, డీసీఎంస్‌లకు డైరక్టర్‌లను ఎన్నుకున్నారు. డైరక్టర్‌ల పదవులన్నీ ఈ నెల 27ననే ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకారం శనివారం డీసీసీబీ •సీఎంఎస్‌లకు చైర్మన్‌లను ఎన్నుకున్నారు. మంత్రులు నల్లగొండ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి,మహబూబ్‌నగర్‌లో మంత్రులు సి.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు, నిజామాబాద్‌లో స్పీకర్‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు తమ పంతాలను నెగ్గించుకున్నారు. స్పీకర్‌ ‌తన కుమారుడిని డీసీసీబీ చైర్మన్‌ను చేయడంలో విజయం సాధించారు. అన్నీ జిల్లాలో శాసనసభ ఎన్నికల నుంచి మొదలుపెడితే ఎన్నికలన్నింటినీ విజయం సాధిస్తున్న టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్రంలోనే హవా కొనసాగిస్తున్నది. ఉమ్మడి జిల్లాలన్నింటిలో టీఆర్‌ఎస్‌ ‌హవా మోగించినందున అతిత్వరలో రాష్ట్ర కో.ఆపరేటివ్‌ ‌సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌పగ్గాలను టీఆర్‌ఎస్‌ ‌బలసరిచిన అభ్యర్థి అందుకోనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!