Take a fresh look at your lifestyle.

కొరోనాకి తోడు డెంగ్యూ, మలేరియా….

తెలుగురాష్ట్రాల్లో  కొరోనా ఉధృతి కొనసాగుతుండగా, భారీ వర్షాల కారణంగా  డెంగ్యూ   చాపకింద నీరులా విస్తరిస్తోంది. మురికి నీరు ఎక్కడికక్కడ పేరుకుని పోవడంతో దోమల ప్రభావంతో డెంగ్యూ , మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తూ  ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.  గోదావరి పరీవాహక ప్రాంతాలు నెలకొన్న జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లాలో  మంత్రులు కెటి రామారావు, ఈటెల  రాజేందర్‌ ‌పర్యటించగా, ఆంధ్రప్రదేశ్‌ ‌లో  ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ఏరియల్‌ ‌సర్వే నిర్వహించి బాధితులకు రెండేసి వేల రూపాయిలను ప్రకటించారు.  తెలుగు రాష్ట్రాల్లో  ప్రాణనష్టం  లేకపోయినా,  ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు ముందుగా హెచ్చరికలు జారీ చేయడం వల్ల ఆస్తి నష్టం కూడా ఈసారి తక్కువే. అయితే, వరద ఉధృతి వల్ల తల దాచుకోవడానికి వేరే ప్రదేశాల లేకపోవడం వల్ల వరద బాధితులు మురికి వాడల్లోగడపాల్సి వస్తోంది. దీంతో  అంటు వ్యాధులు పెరుగుతున్నాయి.

కొరోనాకి సంబంధించి  తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ‌లో కొరోనా కేసులు మూడు లక్షలకు చేరుకున్నాయి. తెలంగాణలో  కేసుల సంఖ్య  పెరగకపోవడానికి టెస్ట్ ‌లు జరపకపోవడమే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళ సై మంగళవారం నాడు జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొరోనా పరీక్షలు సక్రమంగా జరగడం లేదన్న సంగతిని ధ్రువీకరించారు. రాష్ట్ర హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో  హెచ్చరించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కొరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. అయినప్పటికీ అదే సందర్భంలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని ఐసిఎంఆర్‌ ‌వర్గాలు చెబుతున్నాయి. యాక్టివ్‌ ‌కేసుల కన్నా రికవరీ కేసుల రేటు  మూడు రెట్లు అధికంగా ఉందని ఆ వర్గాలు తెలిపాయి.  కొరోనా పరీక్షలు జరిగిన  రాష్ట్రాల్లో  కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నాయి. కొరోనా కేసులకు తోడు డెంగ్యూ , మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డెంగ్యూ  కేసులు ఈ ఏడాది ఇంతవరకూ   తెలంగాణలో  వెయ్యి  కేసులు, మలేరియా  600లు నమోదు  అయ్యాయి. తెలంగాణలో  గ్రామీణ ప్రాంతాలలో కొరోనా కేసుల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.  సొంత వృత్తులపై ఆధారపడి జీవించేవారు  బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలా అని వృత్తులు మానుకుని ఇళ్ళకు పరిమితమయ్యే పరిస్థితి లేదు.  ఆంధ్రప్రదేశ్‌ ‌లో కొంతలో కొంత నయం రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా కులవృత్తుల వారికి సాయం అందిస్తోంది. తెలంగాణలో కొరోనా పరీక్షలు సక్రమంగా జరగడం లేదన్నది కేంద్రం దృష్టికి కూడా వెళ్ళింది. బహుశా కేంద్రం ఆదేశాలతోనే గవర్నర్‌ ‌తమిళసై తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేసి ఉంటారు.

ఈ విపత్తును ఎదుర్కోనేందుకు ప్రభుత్వాలు సంసిద్ధంగా లేకపోవడం వల్ల కేసుల సంఖ్య  పెరుగుతోంది. కొరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు విస్తృతమైన ప్రచారం జరిపించినప్పటికీ, ప్రభుత్వ లాబ్‌ ‌లు తగినన్ని లేకపోవడం, ప్రైవేటు లాబ్‌లలో డబ్బు గుంజేయడం వల్ల కొరోనా కేసుల నిర్ధారణ  విషయంలో ఆలస్యం  జరిగింది.మన దేశంలో  కొరోనా ప్రవేశించే సమయానికి తగినన్ని లాబ్‌ ‌లు లేవు.ఇప్పుడు1470 కేంద్రాలకు కొత్తగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాలు, మహానగరాల్లో కోవిడ్‌ ‌పరీక్షా కేంద్రాలు ఇప్పుడైనా ఉన్నప్పటికీ,  పట్టణాలు, మండలాల్లో ఈ సౌకర్యాలు లేవు.ఆగస్టు 15వ తేదీన8 లక్షలు పైగా పరీక్షలు నిర్వహించాగా ..15 వ తేదీ వరకూ  దేశ వ్యాప్తంగా మూడు కోట్ల పైగా పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ  కేసులలో 23 శాతం ఇండియాలోనే నమోదై, అమెరికా మరియు బ్రెజిల్‌ ‌తరువాత భారత్‌ ‌మూడవ స్థానంలో నిలుస్తోంది.  కొరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ దవాఖానాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించాల్సి వొచ్చింది. ప్రైవేటు,కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌లో  ఫీజులూ ఎక్కవ. పర్యవేక్షణ తక్కువ. ఈ విషయం విజయవాడ హాస్పిటల్‌  అనుబంధంగా ఉన్న ఒక హోటల్‌ ‌లో సంభవించిన అగ్ని ప్రమాదం ఉదాహరణ.పది మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదం   దేశ వ్యాప్తంగా  అందరినీ   కలచివేసింది. యాజమాన్యం నిర్ల క్ష్యం కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది.   ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యము లేకపోవడం వల్లనే మంత్రులు, శాసనసభ్యులు ప్రైవేటు ఆస్పత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు.

దేశంలో 961 ప్రభుత్వ లాబ్‌ ‌లు ఉండగా, 569 ప్రైవేటు లాబ్‌ ‌లు పని చేస్తున్నాయి.మరణాల విషయంలో ఇతరదేశాల కన్నా మన దేశంలో మొదట తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇతర దేశాలను దాటిపోయే పరిస్థితి వచ్చింది.కొరోనా నియంత్రణ కేవలం ప్రభుత్వ సంస్థలు,హాస్పిటల్స్  ‌వల్ల సాధ్యం కాదు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తేనే అది సాధ్యం ఈ విషయాన్ని ప్రధాన మంత్రి స్వయంగా చెబుతూనే ఉన్నారు. కొరోనా నిరోధానికి రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ ‌పై అనుమానాలు  రేకెత్తుతున్న కారణంగా ఎక్కువ మంది  ఆసక్తి చూపడం లేదు. మరో  21 రోజుల్లో కొరోనా వ్యాక్సిన్‌ ‌రావచ్చనీ, కోరోనా నుంచి విముక్తి కలగవచ్చని అంటున్నారుఆ వ్యాక్సిన్‌ ‌కోసం యావత్‌ ‌ప్రపంచం ఎదురు చూస్తోంది.

Leave a Reply